Tuesday, 27 October 2026 08:41:11 AM
# ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ బోర్వెల్ పాయింట్... # ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా వేముల సాంబయ్య గౌడ్ # రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి...

ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా వేముల సాంబయ్య గౌడ్

Date : 17 September 2026 10:35 PM Views : 287

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMU) గౌరవ అధ్యక్షుడిగా నర్సంపేట పట్టణానికి చెందిన వేముల సాంబయ్య గౌడ్‌ను నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గురువారం రోజున నేషనల్ మజ్దూర్ యూనియన్(NMU) నాయకుల సమక్షంలో ప్రకటించారు.నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపో ఉద్యోగులు, కార్మికులు ఏర్పాటు చేసుకున్న నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు గురువారం రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ని కలిసి యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా వేముల సాంబయ్య గౌడ్‌ను నియమించాలని కోరారు.వారి అభ్యర్థన మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, నర్సంపేట మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్‌ ను ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు వేముల సాంబయ్య గౌడ్‌ను శాలువాతో సన్మానించి, మిఠాయిలు పంపిణీ చేశారు.అనంతరం వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.కార్మికుల మధ్య సయోధ్యను పెంపొందిస్తూ, ప్రయాణికుల సంక్షేమం, యూనియన్ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సూచనలను పాటిస్తూ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు.తనపై నమ్మకంతో గౌరవ అధ్యక్షుడిగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి వేముల సాంబయ్య గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఎన్ రావు,బి. సాంబయ్య,ఆకుల స్వామి,ఎండి.రఫీ,జిల్లెల సంపత్,జీకే స్వామి,గడ్డం శ్రీలత,తాటికొండ యాదయ్య,రూపిక సుమన్, ఎస్.రవీంద్రాచారి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :