సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : యూరియా కోసం రైతుల అరి గోస రాత్రి నుండీ లైన్లో నిల్చొని సొమ్మసిల్లి పడిపోయిన మహిళ రైతు యూరియా ఇస్తామని చెప్పి టోకెన్లు ఇచ్చి తరువాత నానో యూరియా ఇస్తామంటున్న యాజమాన్యం నిరసనగా రైతులు రహదారి పై రాష్ట్రరోకో సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట నియోజకవర్గం లో యూరియా కష్టాలు తీరడం లేదు నర్సంపేట మున్సిపాలిటీ చెందిన రాజపల్లి గ్రామంలో యూరియా రావడం తో పండుగ తో సంబంధం లేకుండా రైతులు అర్ధ రాత్రీ నుండి లైన్లో నిల్చోని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు హన్మకొండ అనుష అనే మహిళ రైతు రాత్రీ నుండి లైన్లో నిల్చోని ఉండటం తో స్పృహ తప్పి పడిపోయింది నర్సంపేట పట్టణంలో రైతులకు యూరియా ఇస్తామని టోకెన్లు ఇచ్చి ప్రస్తుతం నానో యూరియా ఇస్తామంటే రైతులు నిరసనగా ప్రధాన రహదారి పై రాస్తారోకో చేపట్టారు ముఖ్యమంత్రి వెంఠనే యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు స్తానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూరియా కష్టాలు రావడం కాంగ్రెసు పార్టీ కి నష్టం కలిగించే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.
-----------------------
Reporter