Tuesday, 15 September 2026 08:15:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా..?

Date : 06 March 2024 12:16 PM Views : 357

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : కేరళలోని వాయనాడ్‌లోనూ పోటీ చేసిన రాహుల్‌ వాయనాడ్‌లో మాత్రం ఘన విజయం సాధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అమేథీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ రాహుల్‌ గాంధీని ఓడించారు. అయితే ఈసారి వాయనాడ్‌లో ఇండియా కూటమి మిత్రపక్షం సీపీఐ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి అనీ రాజాను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో యూపీ అమేథీ నుంచి రాహుల్ తిరిగి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియలేదు. బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాదిలోనే రాహుల్ పోటీ చేయాలని ఇండియా కూటమిలోని మిత్ర పక్షాలు సూచిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో అమేథీ ఓటమి మిగిల్చిన చేదు అనుభవాల రీత్యా దక్షిణాదిన ఒక సేఫ్ సీట్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. రాహుల్ పోటీ చేసేందుకు ఖమ్మం సరైన నియోజకవర్గమని టీపీసీసీ కాంగ్రెస్‌ అధిష్టానం సూచిస్తోంది. అయితే రాహుల్ ఎక్కణ్ణుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంతవరకు పార్టీ హై కమాండ్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడితే.. ఆయనపై ఎవరిని బరిలోకి దించాలన్న విషయంపై టీ బీజేపీ కసరత్తు చేస్తోంది. రాహుల్ గాంధీని స్మృతీ ఇరానీలా ఢీకొట్టగలిగే నేత కోసం కమలనాథులు యత్నాలు ముమ్మరం చేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :