సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : ఎద్దుల వాండ్ల పల్లి తండా సమీపంలో సుమారు రాత్రి 8 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని అక్కడికక్కడే ఇరువురు మృతి ఇద్దరికి తీవ్రగాయలు అయ్యాయి గాయపడిన వారిని నల్లమాడ 30 పడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడనుంచి గాయపడిన మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి నల్లమాడ గ్రామానికి చెందిన దారమేని బోయ రాజు(29) ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు.మరొక వ్యక్తి దొన్నికోట గ్రామానికి చెందిన అనిల్ (20) ఆసుపత్రిలో మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. పోలీసుల కథనం మేరకు నల్లమాడ నుంచి ఎద్దులవాండ్ల పల్లి వైపు వెళుతున్న దారమేని రాజు, వినోద్ , దొన్నికోట వైపు నుంచి నల్లమాడ కు వెళుతున్న అనిల్,కార్తీక్ లు ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో ఉన్నారు. స్థానికులు, ప్రమాదము లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకొని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న సీఐ నిరంజన్ రెడ్డి ఎస్,ఐ వలీబాషా పోలీసు లు సంఘటనా స్థలాన్ని చేరుకొని మృత దేహాలను కదిరి ప్రభత్వ ఆసుపత్రి కి తరలించారు. వివరాలు తెలియాల్సివుంది....
-----------------------
Admin