Saturday, 18 April 2026 06:23:41 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

Date : 24 October 2025 12:12 AM Views : 214

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వెంకటాపురం మండల కేంద్రంలో ది.22-10-2025 బుధవారం నాడు కొమరం భీమ్ విగ్రహానికి మహిళా నాయకులు జేజ్జరి నారాయణమ్మ,ఇర్ప లక్ష్మి పూజ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పశువుల సూర్యనారాయణ మరియు సిద్ధిబోయిన భుజంగరావు కొమరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కోర్స నరసింహమూర్తి , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు, తెలంగాణ భూమి పుత్ర ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచందర్రావు,గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు పూనెం సాయి,చింత సమ్మయ్య, ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్సిక సతీష్ మాట్లాడుతూ ఆదివాసి పోరాట యోధుడు,గోండు బొబ్బిలి కొమురం భీం125వ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించి ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ లంబడాలు మహారాష్ట్రంలో బీసీలుగా చతిస్గడ్డ్ రాష్ట్రంలో ఎస్సీలుగా రాజస్థాన్ లో ఓసిలుగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఎస్టీలుగా కొనసాగుతారని వారు ప్రశ్నించారు.1976 సంవత్సరం నుండి లంబడాలు అక్రమంగా ఎస్టీలుగా కొనసాగడం వల్ల ఆదివాసుల రిజర్వేషన్,విద్యా, ఉద్యోగ రాజకీయ, సంక్షేమ పథకాలలో మొత్తం లంబాడీలు అక్రమంగా దోచుకుంటున్నారని వారు మండిపడ్డారు.ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 3 ఏటూరు నాగారం ఐ.టి.డి.ఏ నందు తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధతలేని లంబాడీలను తొలగించాలని కోరుతూ ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదివాసి ప్రజలకు యువతి యువకులకు పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను తొలగింపు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా నాయకులు కుచ్చంటి చిరంజీవి,గోండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్,ఆదివాసి నవనిర్మాణ సేన జిల్లా నాయకులు కుంజ మహేష్ , శంకర్ ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు క్రిష్ణ బాబు,ఉపాధ్యక్షులు తాటి రాంబాబు,తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం మండల అధ్యక్షులు తాటి లక్ష్మణరావు ఉండం రాంప్రసాద్,శంకర్,మట్టి రమేష్,ఆదివాసి ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :