సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రం తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వన్నెల్ బి, బోదేపల్లి, కిసాన్ నగర్, బస్సాపూర్, జలాల్ పూర్, నాగ పూర్, ఇత్వార్ పేట్, చిట్టా పూర్ మరియు శ్రీరామ్ పూర్ గ్రామాలలోని ప్రధాన రోడ్లపై కేజ్ వీల్స్ తిరగడం నిషేధించడం జరిగిందని రైతులకు బాల్కొండ ఎస్సై కే.గోపి విజ్ఞప్తి చేశారు.రోడ్లపై కేజ్ వీల్ ను తిప్పడం చట్టరీత్యా నేరమని, నిబంధనలకు విరుద్ధంగా నడిపితే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికీ అన్ని గ్రామాలలోని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని గ్రామాలలో పోలీస్ శాఖ తరపున కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని బాల్కొండ ఎస్సై కే గోపి తెలిపారు...
-----------------------
Admin