సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : జగదేవపూర్ మండలం ఇటిక్యాల సర్పంచ్, రావికంటి చంద్రశేఖర్ కు రేణుకా ఎల్లమ్మ దేవాలయం కల్యాణానికి రావాల్సిందిగా శనివారం వారి స్వగృహం లో ఆహ్వాన పత్రికను అందజేసిన తెలంగాణ రాష్ట్ర దార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి ఈ సందర్భంగా వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కాచరం లో వెలసిన రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఈ నెల 21 వ తేదీన నిర్వహించడం జరుగుతుందని అందరూ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు సముద్రాల హరినాథ్,లయన్ దొంతుల సత్యనారాయణ, మర్కుక్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin