సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (అర్బన్ );కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వనందాసు గడ్డలో కానిస్టేబుల్ కృష్ణ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని 11వ వార్డు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ప్రారంభించారు. శనివారం ఉన్నందాస్ గడ్డలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమం లో వారు పాల్గొని మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి అన్ని విధాల సహకరించి దానగుణాన్ని చాటుకోవడమే దీనికి నిదర్శనమని వారు కొనియాడారు. తొమ్మిది రోజులు శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు జరుపుకొని చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి కి సంకేతమని వారు పేర్కొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం లో కానిస్టేబుల్ గుగులోతు కృష్ణ, గూగులోత్ శంకర్, బానోతు రాజ్ కుమార్, గణేష్, భానోత్ రెడ్డి, భూక్య సురేష్, మహేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin