సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చేన్నరావుపేట మండలం లోని వివిధ గ్రామాలలోనీ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు 2 కోట్ల 30 లక్షల రూపాయల తో సీసీ రోడ్లు డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దేశం అభివృద్ధి చెందాలంటే మొదట గ్రామాల అభివృద్ధి జరగాలని గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన అన్నారు మండలంలోని లింగపురం కోనాపురం ఉప్పర పెళ్లి అక్కల్ చెడ అమీనాబాద్ బొజేరువు లింగగిరి గ్రామాల్లో సీసీ రోడ్లు సైడ్ కాలువల నిర్మాణానికి ఈ రోజు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభి వృద్ధి ద్యేయంగా పని చేస్తుందని వారు అన్నారు మండలం లోని అన్ని గ్రామాలకు త్వరలోనే నిధులివ్వడం జరుగుతుందని మహిళ సంఘాల భవనాలకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే దొంతి అన్నారు ఎస్సి సబ్ ప్లాన్ క్రింద సుమారు 2 కోట్ల 30 లక్షల రూపాయల నిధులనీ కేటాయించామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల అధ్యక్షుడు మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీపీ జిల్లా కమిటీ బ్లాక్ కమిటీ నాయకులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు మహిళ కాంగ్రెస్ జిల్లా మండల నాయకురాలు మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల కాంగ్రెస్ అద్యక్షులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువజన కాంగ్రెస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter