Wednesday, 29 July 2026 05:49:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వారం రోజులుగా మౌన దీక్ష చేస్తున్న ప్రియురాలు ససేమీరా అంటున్న ప్రేమికుడు...

Date : 29 September 2022 12:43 AM Views : 835

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కల్లూరు మండలం లోని మర్లపాడు గ్రామంలో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం వారం రోజులుగా ప్రియుడు ఇంటి ముందు మౌనదీక్ష చేస్తున్న ప్రియురాలకు చుక్కెదురైంది. ఐదు సంవత్సరాల తన ప్రేమను అపహిస్తూ, పెళ్లి చేసుకోనంటే చేసుకోనంటూ ప్రియుడు నిరాకరిస్తున్నాడు... గ్రామస్తులు అమ్మాయికి అన్యాయం చేయొద్దంటూ సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి మాటలు పెడ చెవుని పెడుతున్నాడే తప్ప, తాను పట్టిన కుందేలుకు నాలుగే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే నా ప్రేమను గెలిపించుకొనేందుకు ఎన్ని రోజులైనా దీక్ష వీడేది లేదంటూ ప్రేయసి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం చేస్తుంది. మహిళలపై జరుగుతున్న అన్యాయం, అక్రమాల కోసం పుట్టిన మహిళ ఉద్యమ సంఘాలు స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వారం రోజులుగా తనకు న్యాయం చేయండంటూ దీక్ష చేస్తున్న మాడుగుల స్వప్నకు మహిళా సంఘాలు ఎటువంటి హామీలు ఇవ్వకపోవడం పట్ల ప్రజలు నిరసన వ్యక్తం అవుతోంది.విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు ఎలా స్పందించాయి...? ఓ మహిళకు అన్యాయం జరుగుతున్న మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? తమకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే మహిళలను కాపాడుకోవాలనే సంకల్పంతో ఏర్పడ్డ మహిళా సంఘాలే పట్టించుకోకపోతే మహిళలకు న్యాయం ఎలా జరుగుతుందనేది మండలంలో చర్చినియాంశంగా మారింది. పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పలువురి సలహా మేరకు కేసు పెట్టండంటున్నప్పటికీ కేసు కాదు, న్యాయం కావాలి. తనఐదు సంవత్సరాల ప్రేమకు సమాధానం కావాలంటూ దీక్షగా కూర్చున్న, ఆమె, అధికారులు సైతం నిమ్మకునీరేత్తినట్లు వ్యవహరించటంతో ఏం జరుగుతుందోనని అర్థం కాని అయోమయ పరిస్థితిలో అధికారులు ఉన్నారనేది మండలంలో హాట్ టాపిక్ గా మారింది. మహిళా సంఘాల చొరవతోనే ఆమెకు న్యాయం జరుగుతుందనేది మండల ప్రజల్లో ఈ విషయం చర్చ నీ అంశంగా మారింది. అధికారులు అండగా నిలబడితే తగిన న్యాయం జరగవచ్చని పలువురు భావిస్తున్నారు భారతదేశంలో అడుగడుగున మహిళలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వాలు కఠినమైన, పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ప్రతిరోజు ఏదో ఒకచోట ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాల లోపమా? లేక వాటిని అమలుపరుచుటలో జరుగుతున్న జాప్యమా? ఏది ఏమైనా మహిళలపై మాత్రం పిండదశ నుంచే దాడులు జరుగుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.పత్రికలు, సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తుండడం గమనారం. మండలంలో మర్లపాడు గ్రామపంచాయతీలో మాడుగుల స్వప్న విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యమే అందుకు కారణమని తెలుస్తోంది. ఇకనైనా మహిళా సంఘాలు స్పందించి ఆమెకు న్యాయం జరిగేంత వరకు నిష్పక్షపాతంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని మండల ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఆమెకు సరైన న్యాయం జరగాలని ప్రజలు భావిస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :