సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని నినదించేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని, సుమారు మూడు లక్షల మందితో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సభను చేపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు (విహెచ్) స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు విడుదల చేసిందని వివరించారు. త్వరలోనే షాద్ నగర్ పట్టణంలో బీసీ డిక్లరేషన్ విడుదల చేయబోతుందని ప్రకటించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వస్తున్నారని చెప్పారు. పట్టణంలో సభ ఏర్పాట్లు చురుకుగా పనులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. త్వరలోనే సెప్టెంబర్ మొదటి వారంలో జరగనున్న ఈ సభకు సంబంధించిన తేదీ ఖరారు చేనునట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ డిక్లరేషన్ సభ కోసం సుమారు 3 లక్షల మంది సమీకరణ జరుగుతున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి గద్దె దించుతామని హెచ్చరించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న పాలన పై కూడా విహెచ్ విరుచుకోబడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎలా ఎగిరిందో తెలంగాణలో కూడా అదే జరగబోతుందని స్పష్టం చేశారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. బీసీ క్రిమిలేయర్విధానాన్ని ఎత్తివేయాలని శంకర్ పేర్కొన్నారు. ఓబీసీకి ప్రత్యేక మినిస్ట్రీ అవసరం అన్నారు. 50 శాతం రిజర్వేషన్ సీలింగ్ తొలగించాలన్నారు. బీసీ వ్యక్తి ప్రధాన మంత్రిగా ఉండి బీసీలకు న్యాయం చేయలేకపోతున్నాడని విమర్శించారు. అందుకే దేశంలో ఓబీసీ క్యాస్ట్ వైస్ జనగణన జరగాలన్నారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్ లని ప్రైవేటు చేయడం మానేయాలన్నారు. అంతేగాక ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. జ్యూడిషియల్, ప్రైవేట్ సెక్టార్రిజర్వేషన్లు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా చొరవ చూపాలన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రదీప్, సంజీవ్ ముదిరాజ్, రఘు, బాబర్ ఖాన్, బాలరాజు గౌడ్, చంద్రశేఖర్, రాజు, జంగా నరసింహా యాదవ్, జగదీశ్వరప్ప, కొంకళ్ళ చేన్నయ్య, వై. యాదయ్య యాదవ్, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin