Thursday, 30 July 2026 10:25:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పీఆర్‌ఎల్‌ఐను సందర్శించేందుకు వెళ్తున్నాం. ధర్నాకు కాదు...

Date : 10 September 2023 09:37 AM Views : 244

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : పీఆర్‌ఎల్ఐ (పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం) సందర్శించడానికి వెళ్తున్నామని... ధర్నాకు.. రాస్తారోకోకు వెళ్లట్లేదని దీనికి ప్రభుత్వం భయపడి పోలీసుల చేత తమను అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని, ప్రభుత్వం తప్పు చేయకుంటే ఇంత భయం ఎందుకని? టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ప్రశ్నించారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి వీర్లపల్లి శంకర్ మహబూబ్ నగర్ నుండి పీఆర్‌ఎల్‌ఐను సందర్శించేందుకు వెళ్తుంటే అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్‌ఎల్‌ఐ పూర్తి చేశామని సీఎం కేసీఆర్.. మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారన్నారు. అయితే ఇది అవాస్తవం.. అది పూర్తి కాలేదని.. అందులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పటికీ ఖర్చు చేసింది కేవలం 26 వేల కోట్ల రూపాయలని చెప్పుకొచ్చారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటిని పొలాలకు వదులుతున్నమని చెప్పడం బోగస్ అన్నారు. 12 లక్షల ఎకరాలకు నిరందాలంటే 60 - 70 వేల కోట్ల ఖర్చు అవుతుందన్నారు. మరి మీరు ఇంకా టెండర్లు పిలవలేదని.. కాల్వలకు భూ సేకరణ జరగలేదని... పనులకు ప్లాన్ లేదు నీళ్ళు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు. ఇంకా కేఎల్‌ఐలోనే లక్షా నలభై నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు రావాల్సి ఉందని లెక్కలే చెబుతున్నాయన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు 90 టీఎంసీల నీటికి కేంద్రం నుంచి అనుమతులు తేలేదన్నారు. మరి ఇది ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమే అని ఆయన చెప్పుకొచ్చారు. వట్టెం నుంచి లక్ష ఎకరాలకు సాగు నీటికోసం ఇప్పుడు టెండర్లు పిలిచారన్నారు. ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్ల లబ్ధి కోసం.. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంపుల కోసం రూ.2,400 కోట్లు ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇస్తే.. బీహెచ్‌ఈఎల్ ఇదే పంపులను కేవలం రూ.800 కోట్లకు ఇస్తున్నారన్నారు. అంటే కేవలం పంపులు మోటార్ల వల్లనే రూ1600 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దీన్ని నిరుపిస్తానని.. లేదంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తాను ఆరు సార్లు పోటీ చేసినా.. ఏనాడూ కానీ పనులకు హామీ ఇవ్వలేదని.. కేవలం నీతివంతైన పాలన ఇస్తానని చెప్పానన్నారు. గూగుల్‌ను అడ్డుకుంటారా?.. గూగుల్ మ్యాప్‌లో వారి పతనం కనిపిస్తోందన్నారు. ఇదంతా కేవలం కాంగ్రెస్ బహిరంగ సభ ప్రాముఖ్యతను తగ్గించే కుట్ర అని ఆరోపించారు. ఈ సారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధపడ్డారని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :