Sunday, 01 March 2026 07:58:38 PM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

ఒక్క రూపాయికే కార్పొరేట్‌ వైద్యం...

Date : 22 September 2022 01:58 PM Views : 6489

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రికి వెళ్లాంటే భయపడే రోజులు వచ్చాయి. జలుబు చేసి ఆసుపత్రికి వెళ్లినా రూ. 300 కన్సల్టేషన్‌ ఫీజులు చెల్లించాల్సిన రోజులివీ. ఇక సంబంధిత పరీక్షలు, మెడిసిన్‌, ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రికి వెళ్లాంటే భయపడే రోజులు వచ్చాయి. జలుబు చేసి ఆసుపత్రికి వెళ్లినా రూ. 300 కన్సల్టేషన్‌ ఫీజులు చెల్లించాల్సిన రోజులివీ. ఇక సంబంధిత పరీక్షలు, మెడిసిన్‌ వెరసి రూ. వేలల్లో సమర్పించుకోవాల్సిందే. అయితే కేవలం ఒక్క రూపాయి కన్సల్టేషన్‌ ఫీజుతో కార్పొరేట్‌ వైద్యం అందిస్తే ఎలా ఉంటుంది.? ఏంటి జోక్‌ చేస్తున్నామనుకుంటున్నారా.? అయితే ఇది నిజంగా నిజం. డీఎస్‌ఆర్‌ అండ్‌ డీవీఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన జీజీ చారిటీ హాస్పిటల్‌ పేదలకు తక్కువ ధరలో మంచి వైద్యాన్ని అందిస్తోంది. ఇంతకీ ఈ హాస్పిటల్‌ ఎక్కడుందో చెప్పలేదు కదూ.. హైదరాబాద్‌లోని రాంగనగర్‌లో 2022 ఫిబ్రవరిలో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. కన్సల్టేషన్‌ ఫీజుగా కేవలం రూపాయి మాత్రమే తీసుకోవడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత. ఆ ఒక్క రూపాయిని కూడా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హుండీలో వేయాల్సి ఉంటుంది. 24 గంటలపాటు వైద్య సేవలు అందిస్తారు. గర్భిణులు, పిల్లలు, ఆర్థో సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 18 వైద్యులు ఉన్నారు. కేవలం కన్సల్టెన్సీకి మాత్రమే పరిమితం కాకుండా ల్యాబ్‌, ఎక్స్‌రే, ఫిజియోథెరపీ, ఐసీయూ, అల్ట్రాసౌండ్‌ లాంటి పరీక్షలను కూడా తక్కువ ధరకే నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఉచితంగా భోజనం, టిఫిన్లు అందిస్తున్నారు. ఆయూష్‌, ఆరోగ్య శ్రీ పథకాలు కూడా ఇందులో అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి రోజుకు 200 మంది రోగులు వస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :