సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రహరీ గోడను ఆనుకొని గత 18 సంవత్సరాల నుండి వివిధ వృత్తుల వారు ఆటో మెకానిక్, బైక్ మెకానిక్, వెల్డింగ్ షాపులు టీ బంకులు, టిఫిన్ బంకులు పెట్టుకొని తమ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వ వైద్యశాల వారు ప్రహరీ గోడ నిర్మించాలని మీరందరూ ఖాళీ చేయాలని వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసు అందుకున్న బాధితులు ఉన్నపలంగా ఖాళీ చేస్తే మేము మా కుటుంబాలు ఎలా బ్రతకాలి మేము జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది. మాకు ఆటోనగర్లో తలము కేటాయిస్తే మేము మా కుటుంబాలు రోడ్డును పడకుండా ఉంటాయని. ఈరోజు ఎర్రగొండపాలెం తాసిల్దార్ బాలకిషోర్ ను కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బాధితుల ఆవేదన ను విన్న తాసిల్దార్ న్యాయం జరిగేటట్లుగా చూస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు...
-----------------------
Admin