సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో డాక్టర్ బాను ప్రకాష్ నాయక్ ఆధ్వర్యంలో మాతా శిశు మరణాల నివారణపై సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బాను ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పురుడు సమయంలొ తల్లీ, బిడ్డా ఇరువురు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో ఆశా కార్యకర్తలు పనిచేసినప్పుడు మాతా శిశు మరణాలను ఆదిలోనే నివారించవచ్చని పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించిన నెలవారీ ఆశ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈసంధర్బముగా ఆయన మాట్లాడుతూ ఏ దేశ ప్రగతి అయినా మరణాల రేటు పై ఆధారపడి ఉంటుందని అందులోనూ మాతా శిశు మరణాల రేటు అతి తక్కువ గా ఉన్న దేశమే ఉన్నతి, ప్రగతి,సుసంపన్నమైనదిగా పరిగణింపబడుతుందని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో కాన్పు కై గర్భిణీ మహిళలను అందరినీ ప్రోత్సహిస్తూ, జననీ సురక్ష యోజన ప్రభుత్వ పథకాలుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆశ కార్యకర్తల ప్రగతి ,పనితీరు సమీక్షించి పలు సూచనలు, సులహాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఆరోగ్య విస్తరణ, ఆరోగ్య పర్యవేక్షణ మరియూ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin