సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : బీసీ బందు చెక్కుల పంపిణీ కొత్తగూడం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో నిర్వహించారు. కలెక్టర్ ప్రియాంక అలా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బీసీ బందు నిరంతర ప్రక్రియ అని, రానివారు ఎవరు అధైర్యపడవద్దని తదుపరి విడతలో అందరికీ బీసీ బందు అందుతుందన్నారు. 300 మంది కులవృత్తిదారులకు మూడు కోట్ల రూపాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ ప్రియాంక అలా. ఆర్థిక సాయం అందించే దశలో ఇది ఆరంభం మాత్రమే, ఈ ప్రక్రియ దశలవారీగా నడుస్తుందని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని, చేతివృత్తులను కాపాడే సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంతో గొప్పదని, ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఒక లక్ష ఇస్తున్నామని, బీసీ ఎస్సీ ఎస్టీల ఆరాధ్య దైవం కేసీఆర్ అని అన్నారు. కులవృత్తుల వారికి చేయూత బిసి బంధు అని, పేద కుటుంబాలకు పెద్దన్న కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అని పేర్కొన్నారు. వచ్చేది మరల డిఆర్ఎస్ ప్రభుత్వమే, మూడోసారి గెలిచి హ్యాట్రిక్స్ సాధిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ పోటీ కాదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కునే దమ్ము ఏ పార్టీకి లేదని మాది చేతల ప్రభుత్వం ప్రతిపక్షాలను నమ్ముకుంటే తెలంగాణ రాష్ట్రం అంధకారమని పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని వారి దీవెనలతో ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అందరి భాగ్య స్వామ్యం అవసరమని అన్నారు. రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నామని, పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, త్వరలోనే పేదలకు గృహ లక్ష్మీ పథకం కింద నియోజకవర్గంలో పక్కా గృహాలు కట్టిస్తామన్నారు. చివరిగా ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
-----------------------
Admin