సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు... జనవరి25వ తేదీ న జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ఈరోజు కొత్తగూడెంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దురిశెట్టి అనుదీప్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు విద్యార్థులు మరియు అధికారులతో కలిసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఆగి జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాబోయే తరాలు ఓటుకు ప్రాధాన్యత ఇవ్వాలని వారిని ఓటు ఎలా నమోదు చేసుకోవాలి అని 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులకు అవగాహన కల్పించడం జరిగింది. డబ్బుకు ఓటు అమ్ముకోకూడదని దేశాన్ని ముందుకు నడపడానికి ఓటు ఒక ఆయుధమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో MRO రామకృష్ణ, DRO అశోక్ చక్రవర్తి, ASP.p వేణు మరియు ప్రభుత్వ చిన్న స్థాయి అధికారులు వందల విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin