సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్త గూడెం : భారత ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, అలాగే పట్టణ, గ్రామీణ పాత్రికేయుల్లో వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా విషయ నిపుణులతో ప్రత్యేక వర్కుషాప్ లను నిర్వహిస్తూ పలు అంశాల పైన అవగాహన కలిగిస్తున్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. గురువారం ఇల్లందు గెస్ట్ హౌస్ లో జరిగిన వార్తలాప్ - ఒక రోజు వర్క్ షాప్ కి ముఖ్య అతిథిగా ఎన్ బలరామ్ ఐ ఆర్ ఎస్ , సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు సింగరేణి ప్రాంత విలేకరుల కోసం ప్రత్యేక ఆసక్తితో ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలపగానే మా వంతుగా మేము సహకారాన్ని అందించామని, అలాగే తాము ఎంతో పని ఒత్తిడితో బిజీగా ఉన్నప్పటికీ ఇటువంటి సమావేశాల్లో పాల్గొంటున్న సోదర పాత్రికేయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సింగరేణి అభివృద్ధి లో పాత్రికేయ మిత్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్ డీఆర్ఓ, భద్రాద్రి కొత్తగూడెం, గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వాలకు, అధికారులకు, మీడియా కు మధ్య వారధిలా పని చేస్తున్న మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువేనని, సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి వెలుతున్నాయో.. అధికార యంత్రాంగం అప్రమత్తమై పథకాల లోటు పాట్లు ప్రభుత్వాలకు తెలియజేసేది మీడియానే నని. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అధికార యంత్రాంగానికి తెలియజేసి పథకాలు అమలు తీరు ఖచ్చితంగా ఉండేలా మీడియా చేస్తుందని అన్నారు. 10-15 సంవత్సరాల క్రితం ప్రింట్ మీడియా లో వచ్చే వార్తల పట్ల చాలా ప్రాముఖ్యం ఉండేదని.. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారి పోయిందన్నారు. సోషల్ మీడియా ద్వారా అరచేతిలో ప్రపంచం వచ్చేసిందని.. అంతే కాకుండా ఫేక్ న్యూస్ వ్యాప్తి ని అరికట్టాలని, ఫేక్ న్యూస్ అనేది నిజమో కాదో నిర్దారణ అయ్యే వరకు అది వాస్తవం గానే ఉంటుంది..అలాంటి న్యూస్ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని పత్రికా సమాచార కార్యాలయం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తోందని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు, మీడియా కు చేరవేయడంలో పత్రికా సమాచార కార్యాలయం ముఖ్య పాత్ర పోషిస్తోందని వి.బాల కృష్ణ , జాయింట్ డైరెక్టర్, పి ఐ బి తన స్వాగతోపన్యాసం లో తెలిపారు. జర్నలిస్టులు నైతిక విలువలు పాటిస్తూ, ఖచ్చితమైన వార్తలను సేకరించి ప్రజలకు మరిన్ని మంచి వార్తలు అందేలా చూడాలని, మనం వార్తలు రాసే ముందు నిర్దారణ చేసుకోవడం చాలా ముఖ్యమని ఉమా మహేశ్వర రావు అన్నారు. మీడియా లో విలువలు, అభివృద్ధి జర్నలిజం అంశాలపై ఆయన మాట్లాడారు. డిజిటల్ యుగంలో మనం కేవలం వార్తలే కాకుండా మనం వాడే మొబైల్ ఫోన్లు తరచూ అప్డేట్ చేస్తూ ఉండాలని, ఈ సైబర్ యుగంలో మనం డేటా ను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని గురించి మరో వక్త సి డాక్ సైంటిస్ట్ జగదీప్ బాబు అన్నారు. పిఐబి పనితీరుని పి.పి.టి ప్రెజెంటేషన్ ద్వారా అంతకు ముందు డిప్యూటీ డైరెక్టర్ మనస్ కృష్ణ కాంత్ వివరణాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కు చెందిన సిబిసి అధికారి శ్రీ కోటేశ్వర రావు, పి ఐ బి అధికారి శివ చరణ్ రెడ్డి తో పాటు పిఐబి అధికారులు కూడా పాల్గొన్నారు.
-----------------------
Admin