సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకీడు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలు పాలకీడు మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిస్టిపాటి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,సంపూర్ణ ఆరోగ్యంతో భవిష్యత్లో మరెన్నో ఉన్నత శిఖరాలను అధరోహించాలని ఆకాంక్షించారు.ఐటీ రంగంలో దేశ వ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు.ఈకార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి,మండల పార్టీ ఉపాధ్యక్షుడు తాటికొండ వెంకటరెడ్డి,అధికార ప్రతినిధి పసుపులేటి సైదులు,సర్పంచ్ లు,గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
-----------------------
Admin