సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జిల్లా కేంద్రం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఎస్కే ఉమర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందగట్ల సురేందర్ హాజరై మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గతంలో భారత రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచడంతో పాటు డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల మేరకు ఎంఎస్పీకి చట్టబద్రతను కల్పించాలని కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపులో భాగంగా భారతదేశంలో రైతాంగ సమస్యలు ఏవి పరిష్కరించక పోగా వ్యవసాయ ఆధారికంగా దేశంగా ఉన్న మన భారతదేశ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసే విధానాలు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఇప్పటికైనా భారత వ్యవసాయ రంగానికి కాపాడాలని జాతీయ స్థాయిలో ఎస్ కె యం తీసుకున్న పిలుపులో భాగంగా ఆగస్టు 24వ తారీఖున చలో ఢిల్లీ ప్రోగ్రామును విజయవంతం చేయాలని, కనీసం మద్దతు ధర చట్టం ఎం ఎస్ పి కి చట్టబద్రత కల్పించాలని రైతు రుణ విముక్తి చట్టం చేయాలని కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని రైతాంగానికి పై పెట్టిన కేసులను బేసరత్తుగా ఎత్తివేయాలని ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున 763 . మందికి ఎక్స్ గ్రేషియన్ఇవ్వాలని 2022 కేంద్ర ప్రభుత్వం భారత అటవీ చట్ట సవరణల నియమాల బిల్లును రద్దు చేయాలని రైతులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు కారం వెంకటేశ్వర్లు భద్రక్క కళావతి సుజాత వెంకటమ్మ భారతి జానకి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin