Wednesday, 29 July 2026 01:43:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రశ్నాపత్రాల లీకు పై భగ్గుమన్న జిల్లా కాంగ్రెస్...

Date : 20 March 2023 01:31 AM Views : 619

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : టీఎస్పీఎస్సీలో జరిగిన అక్రమాలపై జిల్లా కాంగ్రెస్ కమిటీ భగ్గుమంది. టిపిసిసి ఆదేశానుసారం ఆదివారం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి కేటిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో సరైన న్యాయం జరగడం లేదని దశాబ్దాల పాటు యువత పోరాటం చేసి జీవితాలను త్యాగం చేసి ఉద్యమిస్తే తల్లి సోనియమ్మ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. కానీ కెసిఆర్ కేటీఆర్ పాలనలో తెలంగాణలో ఉద్యోగ నియామకాలు అపహస్యంగా పరిణమించాయని, ఉద్యోగ నియామకాల్లో అడ్డగోలు అవినీతి డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. టిఎస్పిఎస్సి లో ప్రశ్నాపత్రాల లీకేజీ పై ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని అన్నారు. సంవత్సరాలకు సంవత్సరాలు నిరుద్యోగ యువత కుటుంబాన్ని, ఇంటిని వదిలి గ్రంథాలయాల చుట్టూ రీడింగ్ రూమ్ ల చుట్టూ తిరుగుతూ కష్టపడి చదువుకుంటుంటే ప్రభుత్వం వారి పట్ల దయ లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ చాలా హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. టిఎస్పిఎస్సి ఎంతో పారదర్శకంగా పనిచేస్తుందని చెప్తున్నా మంత్రి పేపర్ల లీకు ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీలో మంత్రి పిఏ తిరుపతి హస్తం కూడా ఉందనే పనులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, తిరుపతికి, నిందితుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధం ఉందని, వీరిద్దరు పక్కపక్క గ్రామాలు కావడంతో మంత్రి పిఏ కి కూడా సంబంధం ఉండి ఉండవచ్చని ఆరోపించారు. సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడని పరీక్ష రద్దు చేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. అనేక మంది విద్యార్థులు కష్టనష్టాలు పడి చదువుతుంటే కెసిఆర్, కేటీఆర్ మాత్రం ఉద్యోగాలు అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల ఉసురు ఊకే పోదని భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ... నీళ్లు నిధులు నియామకాలు అంటూ అధికారాన్ని చేజిక్కించుకొని ఉద్యోగాలు అమ్ముకోవడం దారుణమని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కష్టపడి ఉద్యోగం సాధిస్తామని ధైర్యంగా ఉన్న విద్యార్థుల నోట్లో మన్ను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుండి ఇప్పటివరకు ఏ ఒక్క పరీక్ష సక్రమంగా నిర్వహించలేదని ఆరోపించారు. పరీక్షలే సక్రమంగా నిర్వహించలేని టిఆర్ఎస్ దేశ రాజకీయాలను ఏలుతా అనడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నేర్వాలనే ఉద్దేశంతో సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కేసీఆర్ కుటుంబం ఉద్యోగాలు అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్, కేటీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నిరసన చేస్తున్న వారిని పోలీస్ లు అడ్డగిచడంతో పోలీస్ లు డాం డాం పోలీస్ లు నశించాలి అంటూ నినదించారు. దీంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గప్రసాద్ ని మరియు నిరసన కారులని ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో విరితో పాటు జిల్లా యువజన కాంగ్రెస్,కిసాన్ కాంగ్రెస్,మైనారిటీ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్,మొక్కా శేఖర్ గౌడ్,సయ్యద్ హుస్సేన్,నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు,దుద్దుకూరి వెంకటేశ్వర్లు,లకావత్ సైదులు నాయక్,పల్లెబోయిన భారతి చంద్రం,కోప్పెర సరితాఉపేందర్,మిక్కిలినేని మంజులనరేందర్,ముస్తఫారఫీదాబేగం నగర కాంగ్రెస్ నాయకులు నరేందర్, నగర ఓ బి సి,యస్ టి,మైనారిటీ,ఐన్ టి యు సి అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, శంకర్ నాయక్,sk అబ్బాస్ బేగ్,నరాల నరేష్, ఏలూరి రవి కుమార్,మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరావు,నాగటి చంద్రం,sd గౌస్, మహామూద్,ముజాహిద్దీన్,సాదె శంకర్,యాసబోయిన శ్రీశైలం, గడ్డం వెంకటయ్య,గుడిపల్లి గోపి,కాలవ నరసింహారావు,శీలం శ్రీను,డేగల ఉపేందర్,బోయిన సురేష్,పేరం యస్వంత్,కొట్టె ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :