సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండల కేంద్రానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చొరవతో మంజూరి కాగా లబ్ధిదారుల ఇంటికి సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి వెళ్లి ఆ యొక్క చెక్కులను అందజేశారు. అనంతరం ఎస్సీ మాలవాడలో నిన్న మధ్యాహ్నం అనారోగ్యంతో చప్పిడి రత్తమ్మ మరణించగా వారి కుటుంబ సభ్యులను సర్పంచ్ ఓదార్చి చనిపోయిన రత్తమ్మకు నివాళులు అర్పించారు ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండేటి సుధాకర్ రెడ్డి ,గ్రామ కో ఆప్షన్ నెంబర్ వల్లపుదాస్ సురేష్ గౌడ్, కాసాని మహేష్,చింతల సత్యం తదితరులు పాల్గొన్నారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ స్వయంగా సర్పంచ్ మా ఇంటికి వచ్చి చెక్కులు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు...
-----------------------
Admin