Monday, 14 September 2026 07:11:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రత్యెక ఓటర్ల సవరణ -2023 20 వ తేదీలోపు పరిష్కరించాలి...

Date : 16 December 2022 12:23 AM Views : 722

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో ప్రత్యేక ఓటర్ల సవరణ మరియు ఎం.ఎల్.సి. పట్టభద్రులు మరియు ఉపాద్యాయ నియోజకవర్గాల ఎలక్ట్రోరల్స్ పై విజయవాడ నుండి చీఫ్ ఎలక్టరల్  అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అన్ని జిల్లాల  కలెక్టర్ లతో  అసెంబ్లీ నియోకవర్గాల వారీగా క్లయిములు, అభ్యంతరములు, ఫారం – 6 బి కలెక్షన్, డూప్లికేట్ ఎంట్రీ లను ఎం.ఎల్.సి. డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ నుండి తొలగించుట, అందిన కంప్లైంట్ల పై తీసుకున్న చర్యలు తదితర అంశాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. క్లెయిములు మరియు అభ్యంతరాలపై అన్నింటినీ ఈ నెల 25 వ తేదీలోపు పరిష్కరించాలని ఆదేశించారు.  ఈ.సి.ఐ. మార్గదర్శకాలను అనుసరించి పి.ఎస్.ఈ, డి.ఎస్.ఈ లు చేపట్టాలని క్షేత్ర స్థాయిలో బి.ఎల్.ఓ.లు తనిఖీ చేసి అందజేసిన నివేదిక ఆధారంగా మరియు నిబందనల మేరకు ఎస్.ఎస్.ఆర్. 2౦23 లో చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రచీఫ్ ఎలక్టరల్  అధికారి ముఖేష్ మీనా జిల్లా నుంచి  వివరణ కోరగా పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఇంచార్జి డిఆర్ఓ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం సకాలంలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా పరిశీలన పూర్తి చేస్తామన్నారు. ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా (ఎస్ఎస్ఆర్) పెండెన్సీ 10,503 ఉండగా, అందులో 4,699 వెరిఫికేషన్ పూర్తి చేయడం జరిగిందని, నిబంధనల ప్రకారం ఈనెల 20వ తేదీ నాటికి మిగతావి కూడా వెరిఫికేషన్ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ లో కొత్త ఓటర్లను 6,276 గుర్తించడం జరిగిందని, అందులో 31 మంది ట్రాన్స్జెండర్ లను గుర్తించడం జరిగిందని తెలిపారు. అలాగే  ఫోటో సిమ్లరీ ఎంట్రీ 34,834 ఉన్నాయని, నిర్దేశిత సమయంలోగా  క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో నిరుద్యోగుల క్లెయిమ్స్ 6,606 పెండింగ్ ఉందని, ఉపాధ్యాయులకు సంబంధించి 1,258 ఉందని, అనర్హత ఉన్న ఓటర్ ల జాబితాను పరిశీలన చేయడం జరుగుతుందని తెలియజేశారు. వి.సి. అనంతరం జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులతో మాట్లాడుతూ   ఎపిక్ ఆధార్ అతెంటికేషన్ గరుడ యాప్ లో అనుసంధానంపై  పురోగతిపై చర్యలు తీసుకోవాలని ఈ.ఆర్.ఓ. లను ఆదేశించారు. డూప్లికేట్ నమోదైన ఎంట్రీలను  విద్యార్హతలు ఈ.సి.ఐ మార్గదర్శకాలకు అనుగుణంగా లేనివాటిని  తదితర అంశాల వివరాలు జిల్లా ఎన్నికల అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు సత్వరమే చెక్ లిస్టు తయారుచేసి సంబందిత ఎ.ఇ.ఆర్.ఓ కార్యాలయాలకు రేపు ఉదయం లోపు చేరాలని క్షేత్ర స్థాయి నివేదికలను బట్టి  పట్టభద్రులకు సంబంధించి జిల్లా అధికారులతో ఒక కమిటీ  మరియు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎం.ఎల్.సి  కొరకు డి.ఈ.ఓ., ఎం.ఈ.ఓ. లతో కమిటీ ఏర్పాటు చేసి కొత్తగా ఓటర్ నమోదు  కొరకు అందిన జాబితా వెరిఫికేషన్ కమిటీ ముందు ఉంచి కమిటీ నిర్ణయం మేరకు తొలగించడం లేదా మార్పులు  చేర్పులు చేయాలని అన్నారు. వివిధ మార్గాల ద్వారా జిల్లా ఎన్నికల అధికారులకు అందిన డ్రాఫ్ట్  ఎలక్టోరల్స్ పై అభ్యంతరాలు అందిన వాటిపై ఈ నెల 17 తేదీ కల్లా నివేదికలు సి.ఈ.ఓ. ఎ.పి. కార్యాలయం కు చేరాల్సి ఉంటుందని అన్నారు. సరియిన క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చుటకు ప్రదిపాదిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని అన్నారు. కాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు తిప్పేంద్ర నాయక్, రాఘవేంద్ర, కలెక్టరేట్ సూపరింటెండెంట్ గోపాలకృష్ణ, అహుడా అధికారి చిన్నయ్య, తహసీల్దార్ లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: