సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్లగొండ వేదికగా నిర్వహించిన బీ ఆర్ ఎస్ పార్టీ చలో నల్లగొండ బహిరంగ సభ ఓ కుటుంబంలో విషాదం నింపింది సభకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఓ కారు పల్టీ కొట్టి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల పైకి దూసుకెళ్లింది .ఈ క్రమంలో చర్లపల్లి వద్ద కారు వేగంగా వచ్చి పల్టీలు కొడుతూ అక్కడే ఉన్న హోంగార్డు కిషోర్ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందగా ఒక హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన హోంగార్డు ను మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం. ఇక టిఆర్ఎస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని కూడా ప్రమాదం బారిన పడ్డారు. ఆమె కారును ఆటో ఢీకొనడంతో నందిత గాయపడ్డారు .అయితే ఈ ప్రమాదం నుండి తమ సురక్షితంగా బయట పడ్డట్టు నందిత సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపినట్లు సమాచారం. ఇట్టి విషయమై.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ పోలీసులు తెలిపారు...
-----------------------
Admin