Saturday, 18 April 2026 08:17:45 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం... -ఎమ్మేల్యే సండ్ర

Date : 05 October 2022 03:25 AM Views : 371

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఎమ్మెల్యే సండ్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ....ప్రజలందరికీ ముందుగా విజయదశమి శుభాకంక్షలు తెలియజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో భారీ ఎత్తున బతుకమ్మ సంబరాలను తెలంగాణ సoస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని, గత రాత్రి సత్తుపల్లిలో ఎంతో వైభవంగ జరిగిన వేడుకలతో సద్దుల బతుకమ్మలను భారీ ఊరేగింపుతో నిమజ్జనం పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గత 25 రోజులుగా సత్తుపల్లి నియోజకవర్గంలో మంజూరైన 12 వేల ఆసరా పెన్షన్ల తో పాటుగా పాత వాటితో మొత్తం 40 వేలకు పైగా క్రొత్త ఆసరా పెన్షన్స్ కార్డులను వారి వారి గ్రామాలకు వెళ్లి అందజేయడం జరిగిందని చెప్పారు. ఆసరా, కళ్యాణలక్ష్మి, శాదీ ముభరక్, ముఖ్యమంత్రి సహాయనిది (CMRF) చెక్కులు పంపిణీ కార్యక్రమాలక క్షేత్ర స్థాయిలో సహకరించిన పార్టీ నాయకత్వం, యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నాడు విశ్వవ్యాప్తం అయిన తెలంగాణ బ్రాండ్ అంబాజీడర్ అయిన బతుకమ్మ సంబరాలను ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన నియోజకవర్గంలో గ్రామగ్రామాన పెద్ద ఎత్తున సకలజనులతో నిర్వహించుకోవడం లో సహకరించిన అందరకూ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు రూ,, 95 కోట్ల రూ,, లు 10,500 మందికి కల్యాణలక్ష్మి , శాదీ ముభరక్ చెక్కులను నిన్నటితో పూర్తిగా పంపిణీ చేశామని అన్నారు. సాంకేతిక కారణాలతో ఆలస్యం అయిన 65 శాదీ ముభరక్ చేకులను త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. గ్రామీణ ఉపాదీహామీ పథకం క్రింద రూ,, 15 కోట్ల పనులను గ్రామాల్లో సర్పంచ్ లు చేశారని, వాళ్లకు కూడా రూ,, 2 కోట్ల మినహా మొత్తం వారి వారి ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ కావడంతో ఆసరా పెన్షన్ దారులు ఆనందం వ్యక్తం చేస్తు సీఎం కేసీఆర్ గారిని కీర్తిస్తూ హర్షం వ్యక్తం చేశారని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, దేశం తెలంగాణ వైపు చూసేలా చేసిన సీఎం కేసీఆర్ గారి కృషి, సంకల్పం దేశానికే స్ఫూర్తి దాయకమని వారి గొప్పతనాన్ని కొనియాడారు. మున్సిపల్ శాఖామాత్యులు శ్రీ కెటిఆర్ ఒక విజన్ తో పట్టణాల అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయితీల్లో 90% చేపట్టిన అనేక స్వచ్చ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. స్వచ్ఛ గ్రామాలు, స్వఛ్చ మున్సిపాలిటీల్లో 10, 11 పారామీటర్లలో రావడమే కాకుండా, కేంద్ర గ్రామీణ నీటి సరఫరా విభాగం లో తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వడం జరిగిందని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఉన్న ప్రజలతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రజలు సైతం ఒక ఉత్తేజం పొందే విధంగా చేయడమే కాకుండా, భారతదేశంలో ఉన్న రైతాంగం ఇక్కడ చేపడుతున్న రైతుబందు, రైతుభీమా, 24 గం,, ల ఉచిత కరెంటు, నీటిపారుదల ప్రాజెక్టు ల ద్వారా తెలంగాణ జలకళను సంతరించుకుని వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో కథం తొక్కుతూ...తెలంగాణ ప్రజానేత కేసీఆర్ రాష్ట్రానికి కాదు మీరు దేశానికే నాయకత్వం వహించాలని యావత్తు దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు, దేశ హితం కోరే వివిధ శక్తులు ఆహ్వానించడం, సీఎం కేసీఆర్ కూడా పలు రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా రైతులకు జరుగుతున్న అన్యాయాలమీద ఉద్యమాలు జరుగుతుంటే, తెలంగాణ రైతుల పట్ల స్ఫూర్తి దయకమైన పథకాలు చేపట్టిఅండగా నిలవడం హర్షణీయ మని అన్నారు. తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తo కావడానికి సీఎం కేసీ ఆర్ లాంటి.నేత దేశానికి అవసరమనే సంకేతాన్ని బలపరుస్తూ ప్రజలందరూ హర్షం ప్రకటిస్తున్నారని అన్నారు. తెలంగాణ సంక్షేమం దేశ వ్యాప్తంగా అమలు అయ్యే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న భగీరథ సంకల్పం విజయవంతం కావాలని మద్దతు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి కట్టా అజయ్ కుమార్ , టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు డాక్టర్ లక్కినేని రఘు , పసుమర్తి చంద్రరావు, సర్పంచ్ నందిగం ప్రసాద్, శీలం సత్యనారాయణ రెడ్డి, శింగిసాల పద్మ ప్రసాద్, టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ ,.మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్ , మండల రైతు సంఘం అధ్యక్షులు కర్నాటి జయబాబు రెడ్డి, వైఎస్ సర్పంచ్ మందపాటి మాధవరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కర్నాటి సాంబశివారెడ్డి, నాయకులు పుసునూరి శ్రీనివాసరావు, రాచామళ్ళ నాగేశ్వరరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉబ్బన వెంకటరత్నం, ఎంపీటీసీలు గోపిరెడ్డి, కొర్రా రుక్మిణీ నరసింహారావు, న్యాయవాది పప్పుల రత్నాకర్, నీలాద్రి డైరెక్టర్ బానొత్ బాలు, నాయకులు అజ్మీరా జమలయ్య, ch. కిరణ్, గుగులొత్ ప్రసాద్, ఖమ్మంపాటీ రమేష్, సొసైటీ డైరక్టర్ తల్లపురెడ్డి అనిమిరెడ్డి, md. అయుబ్ , యరమల చెన్నారెడ్డి, బొగ్గుల రామిరెడ్డి, అయులూరి నాగిరెడ్డి, మోర్తాల పిచ్చిరెడ్డి, సలీం, మంచాల కృష్ణ, బొల్లేపోగు రామకృష్ణ , బొడ్డెయ్యతదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :