సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : నర్వ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె గ్రామంలో భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఆధ్వర్యంలో 197వ పూలే జయంతి సందర్భంగా SFI జిల్లా ఉపాధ్యక్షులు KM.మహేందర్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. SFI జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ మాట్లాడుతూ... ఈ భారతదేశంలో ఉన్న మతం, కులం, అంటారనితనం,లింగ వివక్షత వంటి అసమనతలపై ఎక్కుపెట్టి ఎదిరిస్తూ ప్రజలని చైతన్యం చేసిన వ్యక్తీ అందుచే ప్రజలచేత మహాత్మా అని పిలిచేంతగా ఎదిగి ఒదిగిన జ్ఞాన వంతుడు పూలే మాత్రమే అంటూ అప్పటి మహారాష్ట్ర లో కలరా లాంటి భయంకరమైన రోగాల బారిన పడిన ఎంతోమంది అనాథ పిల్లలను దత్తతతీసుకుని కాపాడుకున్నారని, సమానత్వానికి చిహ్నంగా చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయారని, తను అనుభవించిన సమాజంలో సమానత్వ పాలన కోసం జీవితాంతం పోరాటం చేసినవ్యక్తీ జ్యోతిరావు పూలే అని అన్నారు. తన భార్య సావిత్రిబాయి పూలే కి విద్యను నేర్పించి భారత దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది సమానత్వాన్ని ఆచరణలో పెట్టిన మొదటి వ్యక్తీ మహనీయుడు. సమాజంలో సామాజిక సమానత్వం కోసం కృషి చేశారు. 1848లో మహిళల కోసం మొదటి పాఠశాల ప్రారంభించడం జరిగింది. వితంతు వివాహాల నిర్మూలన కోసం వసతిని ప్రారంభించి బాల్య వివాహాలను రూపమాపడం కోసం ఇద్దరూ దంపతులు ఎన్నో అవమాన పూరితమైన త్యాగాలు చేశారన్నారు. అందులో భాగంగానే రైతుల సమస్యలపై పోరాటం చేశారని ఇవన్నీ గౌతమ బుద్ధుని బోధనలతో జ్ఞాన వంతుడై స్వాతంత్ర్యం, సమానత్వం, సోధరభావాల వ్యాప్తి కోసం ఈ సమాజంలో వున్న అసమానతలపై నిరంతరం మొట్టమొదటి సారిగా పోరాడిన దిశానిర్దేశకుడు తన సహచరి మొట్ట మొదటి భారతదేశ చదువుల తల్లిగా సావిత్రీ బాయ్ ఫూలేని తీర్చిదిద్దిన ఘనత కూడా జ్యోతిరావు పూలే నని నిర్మొహమాటంగా చెప్పక తప్పదనీ పేర్కోన్నారు. వీరు చేసిన పోరాటాలను మరొకసారి గుర్తుకు తెచ్చుకొని యువత విద్యార్థులు మహిళలు ముఖ్యంగా ఉపాధ్యాయులు మేధావులు స్వేఛ్చ,సమానత్వపూ హక్కులు, భాధ్యతాయుతామైన భారత భూమిపై సంపద,ఉద్యోగ, ఉపాధికోసం, కష్టాపడే నిజాయితీ,నీతి కోసం, భారత రాజ్యాంగ చట్టాలు, హక్కులు, బాధ్యతలపై అవగాహణ చైతన్య పోరాటాలు, ఉద్యమాలు అజ్ఞాన సమాజానికి విజ్ఞానం అందింపచేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో M.రఘు, శశికళ, రామేశ్వరీ, స్పందన, మల్లేశ్వరి,నరేశ్, కావేరి, శివ, అనిత గ్రామ విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin