సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని 6హామీల అమలుకు ముందడుగు వేసి ఆర్టీసిబస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం తోపాటు ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు అధికారికంగా అమలు చేస్తూ, అభయహస్తం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి నేటి నుండి జనవరి 6వ తేదీ వరకు గ్రామాలలోకి ప్రజల వద్దకే అధికారులు వచ్చి దరఖా స్తులు తీసుకుంటారని, దరఖాస్తు ఫారాలు కూడా ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఎంపిటిసిల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్, డిసిసి ప్రధాన కార్యదర్శి బైరెడ్డి జితేందర్ రెడ్డిలు తెలిపారు. పాలకవీడు మండల కేంద్రము లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను పంపిణీ చేసి మాట్లాడారు.జనవరి 2 వ తేదీన గ్రామంలో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను,ముందుగానే ప్రజలకు అందిస్తున్నట్లు వారు తెలిపారు. దరఖాస్తు ఫారాలను నింపడంలో లబ్ధిదారులకు సహకారం అందించాలని అధికారులను కోరారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గ్రామంలో స్త్రీ పురుషులకు విడివిడిగా ఆరు కౌంటర్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మీసాల వెంకటేష్,పంచాయతీ కార్యదర్శి జ్యోతి,అంగన్వాడీ టీచర్ కందాల విజయలక్ష్మి, గ్రామస్థులురాజు,రాములు,లింగయ్య,శంకరయ్య,వెంకట్ రెడ్డి,సైదులు,శ్రీనివాస్, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin