Friday, 08 May 2026 11:29:52 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

గడప గడపకు రఘు... భరోసా యాత్రకు బ్రహ్మరథం పట్టనున్న ప్రజలు...

Date : 24 October 2023 02:35 AM Views : 249

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకీడు మండలం శూన్య పాడు గ్రామంలో మొదటిరోజు విజయవంతంగా భరోసా యాత్ర ముగించుకొని గ్రామంలోని ప్రజలందరూ మద్దతు తనకే ఉందని,తాన లాంటి ప్రజా సేవ చేసే నాయకుడే, ప్రజల కోసం పాటుపడే నాయకుడే తమకు కావాలని కోరుతున్నట్లు తెలిపారు.. రెండో రోజు భరోసా యాత్రలో భాగంగా పిల్లుట్ల రఘు కు రాయిపాడు గ్రామంలో ప్రజలు, పెద్దలు, యువతీ, యువకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.. ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత అధికార నాయకులు ఎవరు తమను పట్టించుకోవడంలేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు తమ బ్రతుకులు ఉన్నాయని అన్నారు.. కానీ మీరు ముందుగా మా సమస్యలు తేల్చుకొని అధికారం లోకి వచ్చాక పక్కగా తీరుస్తారని, మీపై మాకు నమ్మకం ఉందని, మీలా సేవ చేసే నాయకుడే మాకు కావాలని రాయపాడు గ్రామస్తులు, మహిళలు అన్నారు.. ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ ప్రజల సమస్యలు, గ్రామలలో ఉన్న సమస్యలు తీర్చడానికి తాను వచ్చానని,,సింహం గుర్తుకు ఓటు వేసి ప్రజలు తన ఆదరించిలని కోరారు. తను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు..ఇంతకు ముందు ఉన్న నాయకులు, అధికారంలో ఉండి ఏమి చేయకుండా ఏదో చేశామని చెప్పే నాయకులు, పార్టీల్లో ఉన్న వారికే పథకాలు ఇస్తున్నారు..పార్టీల పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తూ అవినీతికి పాల్పడే నాయకులను చూశారు.. తాను అలాంటి నాయకుడిని కాదని తాను అధికారంలో లేకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు చేశానని, అది ప్రజలందరూ కళ్లారా చూస్తున్నారని ప్రజలందరి దయతో, దేవుళ్ళ ఆశీస్సులతో తనకు మద్దతు తెలిపి సింహం గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు.. ఇప్పుడున్న పార్టీ నాయకులు కండువాలు కప్పుకొని పార్టీలు మారుతున్నారని, ప్రజల వేసిన ఓటుతో గెలిచిన నాయకులు, పార్టీలు మారితే ప్రజలు మారినట్లా...దొంగ ముఠాలను,అవినీతి నాయకులను ప్రజలు నమ్మవద్దని తెలిపారు.. ప్రజలు ఆలోచన చేసి నియోజకవర్గంలో మార్పుకై సింహం గుర్తుకు ఓటేయాలి అన్నారు.. సమాజంలో మార్పు రావాలి.. ఆ మార్పు గొప్పగా ఉండాలి.. ఆ మార్పు ప్రజా తీర్పుతోనే,ఆ తీర్పు చెడును ప్రారదోలి మంచి ని సాధించేదిగా ఉండాలి. పాత నాయకుల్ని, పాత పాలనలను, పాత పార్టీలను ఏన్ని రోజులు చూస్తాము.. మన సామాన్యుల కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, మన తెలిసిన వాడిగా, ఒక రైతు బిడ్డగా ప్రజలందరూ ఆదరించాలని, పార్టీల్లో లేకపోయినా అధికారంలోకి వచ్చాక అధికారంలో ఉన్న ఏ నాయకులు చేయలేని గొప్ప పనులు తాను చేస్తానని సింహం గుర్తుకు ఓటేసి హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.ఈ గడపగడపకు భరోసా యాత్రలో రఘు అన్న అభిమానులు, గ్రామస్తులు,మహిళలు, ఓజో ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :