సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: పట్టం ప్రజలకు తాగునీరు అందించే కిన్నెరసాని మంచినీటి స్థానంలో మురికినీరు సరఫరా అవుతుందని దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారి సహనానికీ కూడా ఓ హద్దు ఉంటుందని,వారు తిరగబడక ముందే ప్రజా ప్రతినిధులు,సంబంధిత అధికారులు మెలుకోవాలని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.గత కొద్దిరోజులుగా ఈ సమస్యపై ప్రజలు చేస్తున్న ఫిర్యాదు మేరకు పార్టీ శ్రేణులతో కలిసి పోస్ట్ ఆఫీసు ఎదుట సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు...అనంతరం స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పట్టించుకోవాలని కోరుతూ బురద నీటి పరిస్థితిని వివరించెందుకు పోస్టాఫీసులో పోస్ట్ ద్వారా పంపించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తాము గతంలో అనేక మార్లు ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు..ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని,పైప్ లైన్లు లికేజ్ అవ్వడంతో మంచినీటి పైపు లైన్ ల ద్వారా కలిసిపోయి బురదనీరు సరఫరా అవుతుందని వివరించారు..దీంతో ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని పలు వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు...ఇటువంటి నీటిని మీ కుటుంబ సభ్యులు సేవిస్తారా అని నిలదీశారు...వెంటనే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని లేదంటే ఈ నెల 16వ తేదీన ప్రజలను సమీకరించి మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు వంగా రవిశంకర్,ధూమల రాకేష్,నిరంజన్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin