Thursday, 30 July 2026 04:53:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ లో ఇంటింటి ప్రచారం...

Date : 15 November 2023 01:27 AM Views : 438

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాక శిరచ్ఛేదనం తప్పదని బీఆర్ఎస్ ప్రభుత్వం నేల కూలాల్సిందేనని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోగల 23, 24 వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఇంద్రానగర్ కాలనీలో అధికార పార్టీని పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసిందేం లేదు. సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుంటుంటే.. ఈ దద్దమ్మ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి కేసీఆర్ పాలనలో దాపురించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది. లేకపోతే 30లక్షల మంది నిరుద్యోగ యువకులు అడవి బాట పట్టే పరిస్థితి వస్తుంది. నిరుద్యోగ యువతి ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకుంటే.. కేసీఆర్ ప్రభుత్వం ఆ కుటుంబం పరువును బజారుకీడ్చింది. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాక శిరచ్ఛేదనం జరిగింది. పాపాల భైరవుడు కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో శిరచ్ఛేదనం జరగాల్సిందే.. బీఆర్ఎస్ ప్రభుత్వం నేల కూలాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తాం. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తాం. రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిచే బాధ్యత కాంగ్రెస్‌ది ఆన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దంగు శ్రీనివాస్ యాదవ్, కొన దేవయ్య, ఖదీర్, నల్లమోని శ్రీధర్, సుదర్శన్, అర్జున్ లక్ష్మణ్, శేఖర్, బసవనప్ప, వాసు, రాంనగర్ కాలనీ రవి, సురేష్, సత్తిబాబు, నందు, గంగ ముని సత్తయ్య, మన్నె రవి, లడ్డు, మరియు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: