సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : -పుష్పా సినిమా తరహాలో డీసీఎం కి ప్రత్యేక క్యాబిన్ - నలుగురు నిందితులు అరెస్ట్ - 862. 35 కేజీల గంజాయి స్వాధీనం - విలువ సుమారు 1, 29, 30,000 లక్షలు - డీసీఎం, స్విఫ్ట్ డిజైర్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం - పరారీలో నలుగురు చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో బారి మొత్తంలో గంజాయి స్వాధీనం. ఎస్ పి రేమా రాజేశ్వరి అధ్వర్యంలో చిట్యాల పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా గంజాయి అక్రమ రవాణా పై ఒక పాదం మోపడంతోపాటు నిరంతర నిఘా నీడలో భాగంగా నల్గొండ జిల్లా ఎస్ పి రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది చిట్యాల పోలీసులు లకు లభించిన విశ్వనీయ సమాచారం మేరకు తేది 07 అక్టోబర్ 22 తెల్లవారుజామున చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ హెచ్ 65 రైల్వే స్టేషన్ రోడ్డు నందు సోదాలు నిర్వహించగా ఆంధ్ర నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఒక డీసీఎం టీఎస్ 12 యు డి 21 72, స్విఫ్ట్ డిజైర్ తెలుపు రంగు కారు నెంబర్ టిఎస్ 13 ఏపీ 2700 లను ఆపి తనిఖీ చేస్తుండగా గంజాయి బస్తాలను గుర్తించడం జరిగింది. ఇది సుమారు 862. 35 కేజీల కేజీలుగా గుర్తించడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు తెలిపిన వివరాల ప్రకారం దీని విలువ సుమారు 1,29,30,000 లక్షలు గా ఉంటుందని అన్నారు. నిందితులు తెలిపిన వివరాలు ప్రకారంమహామధ్ హైదర్ ఆలీ తండ్రి ఖాదర్ అలీ వయసు 45 వృత్తి డ్రైవర్ నివాసం రసం పుర ఓల్డ్ సిటీ హైదరాబాద్, నసీరుద్దీన్ తండ్రి వలి వయసు 27 వృత్తి డ్రైవర్ ప్రస్తుత నివాసం గుడిమల్కాపూర్ హైదరాబాద్ సొంత నివాసం మైదుకూరు కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్, వెంకట్ రాథోడ్ తండ్రి బండారి రాథోడ్ వయసు 33 నివాసం జంగిగమ్మ తండ శాంతాపూర్ మండలం ఔరద తాలూకా బీదర్ కర్ణాటక, మనోజ్ గొర్లె తండ్రి దొండి వాయస్సు 32 వయసు వృత్తి డ్రైవర్ నివాసం చూడి బజార్ బేగంబజార్ హైదరాబాద్ స్థిర నివాసం తడికెల్ బెంగళూరు తాలూకా నాందేడ్ మహారాష్ట్ర గా ఉన్నారు. వీరిలో మొహమ్మద్ హైదరాలి తండ్రి ఖాదర్ అలీ అందాజా రెండు నెల క్రితం డ్రైవింగ్ ఫీల్డ్ లో ప్రతాప్ ద్వారా శివాజీ రాథోడ్ అతని అన్నకు పరిచయాలు ఏర్పడ్డాయి. వెంకట్ రాథోడ్ అతని బావమరిది మహాదేవ్ జాదవ్ వ్యాపారానికి పెట్టుబడి వ్యక్తి పరిచయమయ్యారు. వీరు అందరూ కలిసి గంజాయిని రాజమండ్రి నుండి తక్కువ ధర కొనుగోలు చేసి అక్రమ గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటారని ఆరు పది ఇరవై రెండు రోజుల ఉదయం శివాజీ రాథోడ్ మహమ్మద్ హైదర్ అలీ కి ఫోన్ చేసి బంజాయ్ తీసుకొని రావడానికి రాజమండ్రి కి వెళ్లాలని ఫోన్ చేయగా అందుకని నీతో పాటుగా అదనపు డ్రైవర్ నసీరుద్దీన్ ఆసిఫ్ కూడా పంపిస్తా అని చెప్పగా హైదర్ అలీ సరే అన్నారు. డీసీఎం ను తీసుకొని రాజమండ్రి కి వెళ్లి రాథోడ్ ఫోన్ చేయగా ఒక శివాజీకి తెలిసిన వ్యక్తి రాజమండ్రి దగ్గర చింతూరు సురేష్, రమేష్ దగ్గర గంజాయిని తీసుకురమ్మని మహమ్మద్ హైదర్ నజరుద్దీన్ ఆసిఫ్ లకు చెప్పి స్విఫ్ట్ డిజైర్ కారులో మొత్తం నలుగురు వ్యక్తులు శివాజీ రాథోడ్, వెంకట్ రాథోడ్, కార్ డ్రైవర్ మనోజ్ గూర్లే, చింటూలు, అక్కడికి వచ్చి కారు వెనక డిక్కీలో 72 ప్యాకెట్లు నింపుకొని తర్వాత డీసీఎం క్యాబిన్లో వెనుక చిన్న డబ్బా మాదిరిగా ప్రత్యేకంగా తయారు చేయించి ముందు వైపు డోలు తెచ్చుకునే విధంగా ఉండేటట్లు ఎవరికి అనుమానం రాకుండా అందులో 358 ప్యాకెట్స్ లోడ్ చేయించుకొని అక్కడి నుంచి డీసీఎంకు ఎస్కార్డు వాహనంగా భద్రాచలం ఖమ్మం సూర్యాపేట మీదుగా హైదరాబాద్కు వెళ్ళచ్చు పిలుచున్న సమయంలో 07 అక్టోబర్ 22 ఉదయం 7 గంటలకు చిట్యాల స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ ఎన్ హెచ్ 65 లో అటువైపుగా వస్తున్న డీసీఎంను ఆపి అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను మహమ్మద్ హైదర్ అలీ, నసీరుద్దీన్ ఆసిఫ్, వెంకట్ రాథోడ్ లను తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుబడి చేసి వెనుకాల వస్తున్న షిఫ్ట్ కార్ లో ఉన్నవారు పోలీసువారి ఆపగా అది చూసిన శివాజీ రాథోడ్, చింటూ పారిపోగా డ్రైవర్ అయిన మనోజ్ గురలే లను పట్టుకొని కేసు నమోదు చేసుకొని రిమాండ్ కి పంపనైనది. పరారీలో ఉన్నవారు మహాదేవ జాదవ్, శివాజీ రాథోడ్, సురేష్ ,రమేష్ చింటూ లు గా ఉన్నారు. ఈ కేసు చేదించిన నల్గొండ డి ఎస్ పి నర్సింహారెడ్డి, చిట్యాల సిఐ శివరాం రెడ్డి, ఎస్ ఐ ధర్మ, హెచ్ సి 1244 శ్రీనివాస్ రెడ్డి, పి సి 3877 సాయికుమార్, పి సి 3838, ఎండి కలీం, హెచ్ జి 299 యాదయ్య, టాస్క్ఫోర్స్ సిబ్బంది లను ఎస్పీ రేమా రాజేశ్వరి అభినందించారు.
-----------------------
Admin