Monday, 14 September 2026 07:13:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చనిపోయిన వ్యక్తి ఖాతాలోకి లక్షల కోట్లు..!

Date : 09 August 2025 10:47 AM Views : 355

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : గ్రేటర్ నోయిడాకు చెందిన గాయత్రి దేవి అనే మహిళ రెండు నెలల క్రితం మరణించింది. ఆమె కుమారుడు 19 ఏళ్ల దీపక్.. తన తల్లి ఖాతాను నిర్వహిస్తుండేవాడు. ఈ క్రమంలో రాత్రి తన తల్లి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఫోన్‌కి ఒక సందేశం వచ్చింది. అందులో ఒక లక్షా పదమూడు వేల కోట్ల రూపాయలకు పైగా (10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299) డబ్బులు జమ అయినట్లుగా చూపించింది. మొదట ఈ సంఖ్యలో ఉన్న సున్నాలను చూసి దీపక్ ఆశ్చర్యపోయాడు. ఇది పొరపాటు అనుకుని తన స్నేహితులకు ఈ సందేశాన్ని పంపించాడు. వారు నిజంగానే మీ అమ్మ ఖాతాలో లక్షల కోట్లు క్రెడిట్ అయ్యాయని చెప్పారు. అతడు కూడా ఖాతా చూసుకుని మరింత షాక్ అయ్యాడు. దీంతో సోమవారం రోజు ఉదయమే.. దీపక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ శాఖకు వెళ్లాడు.ఈ సంఘటన గురించి బ్యాంకు అధికారులకు తెలియజేయగా.. వారు కూడా నివ్వెరపోయారు. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీ జరగడం అసాధారణం కావడంతో.. వెంటనే ఆ ఖాతాను ఫ్రీజ్ చేసి, ఈ విషయాన్ని ఆదాయపు పన్ను విభాగానికి తెలియజేశారు. ఈ భారీ మొత్తం ఖాతాలో జమ కావడానికి పలు కారణాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది బ్యాంకింగ్ లోపం వల్ల జరిగిందా, సాంకేతిక సమస్య వల్ల జరిగిందా లేదా మనీలాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు సంబంధించినదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఇంత పెద్ద మొత్తం ఒక సాధారణ వ్యక్తి ఖాతాలోకి, అందులోనూ మరణించిన వ్యక్తి ఖాతాలోకి రావడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ప్రారంభించింది. దీని వెనుక అసలు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: