సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికీ చెందిన అంగోతు కమిలి గత మూడురోజుల క్రితం అనారోగ్యం తో చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యుల కి రఘు చేయూత ద్వార 5000/- ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కల వెంకన్న చేతుల మీదుగా వారి కుమారుడు దుర్గాప్రసాద్ కీ అందజేశారు. నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఓజో ఫౌండేషన్ సభ్యులు యాక్టీవ్ నెంబర్ సౌదసోత్ రవి నాయక్ ద్వారా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న కు తెలియజేయగా వారు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు కు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబనికి ఓజో ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేసారు కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో రఘు చేయుతా ద్వారా ఎస్ సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నము ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 3001 కుటుంబాలకు దశ దిన & వివాహా మహోత్సవ కార్యక్రమాలకు ఆర్ధిక సాయం చేయడం జరిగింది రామచంద్ర పురం గ్రామంలో రఘు విద్యార్ధులకు ఉచితంగా హాస్టల్ ఫీజ్, అన్నదాన కార్యక్రమనికి సాయం చేయడం, అదేవిధంగా వినాయక విగ్రలు, అమ్మవారి విగ్రహాలూ వివ్వడం గాని, ఎన్నో నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వార ఆర్ధిక సాయం చేయడం గానీ బతుకమ్మ పండుగ సందర్భంగా బహుమతులు వివ్వడం క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా సమగ్రీని వివ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే హుజూర్ నగర్ నియోజకర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు, రఘు లాంటి మంచి వ్యక్తికి మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో ఒక అవకాశం వివ్వాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో సౌదాసోత్ రవి నాయక్, రాజు నాయక్, బాబు నాయక్,యల్లవులా శివ శంకర్ యాదవ్, యాసారపు సుధాకర్, అంజయ్య , అరియ నాయక్,అంగోత్ రమేష్, రాజు, గమ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin