Thursday, 30 July 2026 08:27:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పద్మశాలి కార్తీక మాస వన భోజన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

Date : 17 November 2025 05:02 PM Views : 260

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ లోని చింతల్ గ్రౌండ్ లో జరిగిన పద్మశాలి కార్తీకమాస వన భోజన మహోత్సవానికి అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ,మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమ నిర్వాహకులు ప్రజలు మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి సురేఖ నిర్వాహకులు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు.ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ పూర్వీకులు మన ప్రయోజనాలను కోరి అనేక ఆచారాలను సంప్రదాయాలను ఏర్పరిచారని సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేసే వన భోజన కార్యక్రమం అలాంటిదేనని అన్నారు. వన భోజనాలకు వచ్చిన వారికి పేరుపేరునా మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు.ఆ రోజుల్లో ప్రజలు ఆధ్యాత్మిక సామాజిక ప్రయోజనాలను ఆశించి వన భోజనాలు జరుపుకునేవారని అన్నారు.కానీ కాల క్రమంలో కులాల వారీగా వన భోజనాలు జరుపుకునే ఆచారం వచ్చిందని తెలిపారు.ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరూ సహకరించుకుంటూ పోతే ప్రజల మధ్య సహృద్భావ సంబంధాలు పెంపొంది వసుదైక కుటుంబంగా వర్ధిల్లుతాతమనీ సత్సంబంధాలు పెరిగి ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.వన భోజనాలతో ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరిగి వైవాహిక సంబంధాలతో కుటుంబ బంధాలు మరింత బలపడతాయని మంత్రి అన్నారు.వన భోజనాల తర్వాత కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమని మంత్రి సురేఖ పేర్కొన్నారు.తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :