Thursday, 30 July 2026 02:41:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ట్యాంక్‌బండ్ అడ్డాగా ఒక్క రోజే 67 చోరీ కేసులు...

Date : 29 September 2023 03:28 PM Views : 379

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్‌లో ఓవైపు గణేషుడి శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగుతోంది. మరోవైపు.. అదే మంచి ఛాన్స్ అంటూ రెచ్చిపోయారు జేబు దొంగలు. భారీగా తరలివచ్చిన జనాలనే ఆసరాగా చేసుకుని తమ చేతివాటం ప్రదర్శించారు కేటుగాళ్లు. వేలాది గణపయ్యాలు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడికి చేరుతుంటే.. ఆ అద్భుత, సుందర దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు సాగర తీరానికి తరలి వచ్చారు. కానీ, మాకు కావాల్సిందే అన్నట్లుగా.. పిక్‌పాకెటర్స్ రెచ్చిపోయారు. అందినకాడికి దోచుకున్నారు. ప్రజల జేబులను కొల్లగొట్టారు. ట్యాంక్‌బండ్‌పై హడావుడిని తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు కేటుగాళ్లు. వేలాది మంది పోలీసులు.. వందలాది కెమెరాల కళ్లుగప్పి.. ప్రజల జేబులను దోచుకున్నారు దొంగలు. రెండవ రోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు.. కాగా, హైదరాబాద్‌లో రెండవ రోజు కూడా గణేష్‌ శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగుతోంది. వేలాది గణపతులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. 24 గంటలుగా ఆటంకం లేకుండా యాత్ర కొనసాగుతూ వస్తోంది. ట్యాంక్‌బండ్‌పై ఇంకా హడావుడి కనిపిస్తోంది. భారీ గణేషుల శోభాయాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే, వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. దొంగలు ఉన్నారని, తమ తమ వస్తువుల పట్ల పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇక ఒకే రోజు 67 చోరీ కేసులు నమోదవడంతో పోలీసులు కూడా భద్రతను పటిష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :