Monday, 14 September 2026 10:06:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మరణం లేని మహనీయుడు వైఎస్సార్ ...

Date : 03 September 2023 01:34 AM Views : 246

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమాలకు శ్రీకారం చుట్టింది కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఊకంటి గోపాల్ రావు, ఆళ్ల మురళి కొనియాడారు. శనివారం కొత్తగూడెం లోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నమ్ముకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిదనీ అన్నారు. అనుకున్నది సాధించడానికి ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం ఆయన నైజం. ఆయన నవ్వుతూ ఉండేవాడనీ కార్యకర్తలను కూడా నవ్వుతూ ఉండమనేవారనీ అన్నారు. సంక్షేమలో ఎన్టీఆర్ మరిపించిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికె దక్కిందని అన్నారు. పేదల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, దళితుల కోసం, విద్యార్థుల కోసం అనేక రకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య రక్షణ కోసం 108 ,104 లాంటి సౌకర్యాలు కల్పించి ఆరోగ్య శ్రీ తో అనేకమంది పేదల గుండెల్లో దేవుడుగా నిలిచినటువంటి వైయస్సార్ మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా యావత్ భారత కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని వారి మరణం పేద ప్రజలను కాంగ్రెస్ పార్టీని ఎంతో క్రుంగతీసిందన్నారు. తనలాంటి ఎందరికో రాయకీయ పునాదులు వేసిన నాయకుడు అంటూ మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డితో తన పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నాగా సీతారాములు. వైఎస్సార్‌ పార్టీ కార్యకర్తలను ఎంతగానో ప్రోత్సహించేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండ్ర నాగబాబు,మైనారిటీ నాయకులు ఖలీల్, లక్కినేని సాయి, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :