Wednesday, 29 July 2026 02:32:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లాలో 475 జీపిలకు గాను 236 మంది స్పెషల్ ఆఫీసర్లు నియామకం...

Date : 03 February 2024 11:11 AM Views : 391

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంపీడీవోలు, ఎంపీఓల సహకారంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సూచించారు. కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సిహెచ్ ప్రియాంకతో కలిసి వెబ్ ఎక్స్ ద్వారా కొత్తగా స్పెషల్ ఆఫీసర్లుగా ఎంపికైన 236 మంది అధికారులు, గ్రామపంచాయతీ సెక్రటరీలతో తో కలెక్టర్ సమావేశం నిర్వహించి వారికి దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ ఆఫీసర్లు వెంటనే రేపు ఉదయం 9 గంటలకల్లా చార్జి తీసుకున్నట్లుగా రిపోర్టు చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామపంచాయతీకి సంబంధించిన రికార్డులు, లాగిన్లతో సహా పూర్తి చార్జిని తీసుకోవాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు గ్రామపంచాయతీలలో ఇంతకుముందు పాలకవర్గం నిర్వహించిన పనులన్నీ సక్రమంగా నిర్వహించాలన్నారు. తీసుకొనే ప్రతి నిర్ణయం ప్రజలకు ఉపయోగపడే విధంగా పూర్తి బాధ్యతతో పనిచేయాలని, ప్రభుత్వ ఆస్తులు నిధులు దుర్వినియోగం చేయకుండా పనులను చేపట్టాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో ప్రతిరోజు నిర్వహించే పారిశుద్ధ్య పనులు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర పనులను ఆటంకం లేకుండా చేపట్టాలన్నారు. ముందుగా స్పెషల్ ఆఫీసర్లు ఎంజిఎన్ఆర్జిఎస్ కేంద్ర తీసుకున్న సిసి రోడ్లకు ప్రతిపాదించిన పనులకు ఆమోదించినట్టుగా తీర్మానం చేసి నటిప్రతిని పంచాయతీరాజ్ ఇంజనీర్లకు అందజేయాలని కలెక్టర్ సూచించారు . ఎంపీడీవోలు, ఎంపిఓల సహకారంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని కొత్తగా ఎంపికైన స్పెషల్ ఆఫీసర్ల కు కలెక్టర్ సూచించారు. ఇంతకాలం అనేక సేవలు ప్రజలకు అందించి అధికారులతో సమన్వయంతో పనిచేసి వారి పదవి కాలం పూర్తి అయిన సందర్భంగా సర్పంచ్ లందరికీ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో సి ఈ ఓ సురేష్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య పాటు కొత్తగా ఎంపికైన స్పెషల్ ఆఫీసర్లు, డి ఎల్ పి ఓ , యండిఓలు,యంపిఓ లు, గ్రామపంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :