సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రం రైల్వే స్టేషన్ నుంచి పెదవీడు మీదుగా నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్లే బొగ్గు సరఫరా ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో పూరి అంజయ్య, అనే వ్యక్తికి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇంకొక మహిళ కూడా ప్రమాదంలో గాయాల పాలయ్యింది. జరిగింది. ఈ బొగ్గు రవాణా జరుగుతుండడం, అట్టి రవాణాలో భాగంగా చిన్న చిన్న బొగ్గు గుళికలు లారీ ల నుంచి కింద పడడం, దుమ్ము, ధూళి రోడ్డును కమ్మేసే విధంగా అవడంతో బైకు ప్రయాణికులు స్లిప్పయి కింద పడటం జరుగుతుంది పెద్ద పెద్ద భారీ వాహనాలు వెళ్లేటప్పుడు ఆ బోగ్గు గుళికలు టైర్ల కింద పడి స్లిప్ పై బాటసారులకు తగిలి గాయాల పాలవుతున్నారు. ఇట్టి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బొగ్గు రవాణాసర్వీసులను జాగ్రత్తగా చేయాలని మనవి చేస్తూ ప్రమాదాలను జరగకుండా చూడాలని ఎన్ సి ఎల్ యాజమాన్యానికి మనవి చేస్తున్నాం. రెడపంగు . నాగరాజు (మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు), చిలక. లోకేష్ (మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్) ఎండి.అక్బర్ (మండల మైనార్టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి), రెడపంగు .కాశయ్య. తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin