సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గ, మండల కేంద్రంలో మండల పరిషత్, వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గాంధీజీ చిత్ర పటానికి ఎంపీపీ శ్రీరామ్ మూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ సెంటర్లో గాంధీజీ బొమ్మకు ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, వాసవి క్లబ్ మండల అధ్యక్షులు దేవ రాజ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మండల అధ్యక్షులు సంకా ప్రసాద్, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
-----------------------
Admin