సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కొండకమార్ల లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు, నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు కొండకమర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులు పాల్గొని ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం బాలయ్య అభిమానులు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేదల పక్షాన నిలబడుతోన్న గొప్ప నాయకుడు, సినిమా పరిశ్రమలో ఏ మాత్రం తగ్గని చరిష్మాతో ప్రేక్షకులను అలరిస్తోన్న నట సింహం హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కొండకమర్ల తెలుగుదేశం పార్టీ లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపు కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు హిందూపురం పార్లమెంటరీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జాకీర్ అహ్మద్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడిసం రామాంజనేయులు, హిందూపురం పార్లమెంటరీ తెలుగు యువత, కార్యదర్శి జయచంద్ర రెడ్డి మండల తెలుగు యువత అధ్యక్షుడు కొండే ఈశ్వరయ్య, మాజీ ఉపసర్పంచ్ సాదిక్వలి, నియోజకవర్గ మైనార్టీ సెల్ కార్యదర్శి ఇర్షాద్, మాజీ డీలర్ చిన్న రాయుడు,సంగాల శ్రీనివాసులు, మాజీ వార్డ్ మెంబర్ కేశవ, గండికోట ఇమ్రాన్, మల్లోళ్ళపల్లి రాజారెడ్డి, లక్ష్మీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin