Monday, 14 September 2026 09:34:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో ఘనంగా వైయస్సార్ వర్ధంతి వేడుకలు...

Date : 03 September 2023 01:56 AM Views : 195

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని, ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరువలేమని వైఎస్ఆర్టీపీ పార్టీ షాద్ నగర్ కోఆర్డినేటర్ ఎండి ఇబ్రహీం అన్నారు. ఓ మహానీయుడా... నీ సేవలు మరువలేము అంటూ వైయస్సార్ సేవలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకొని వైయస్ఆర్టిపి పార్టీ కోఆర్డినేటర్ ఎండి ఇబ్రహీం ఆధ్వర్యంలో షాద్ నగర్ ముఖ్య కూడలిలోని వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం పక్కనే ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సహితం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎండి ఇబ్రహీం మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో ఎంతోమందికి ఉపయోగం చేకూరిందని ఆయన గుర్తు చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ పాలనలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందారని అన్నారు. వైఎస్ఆర్ తనయ వైయస్ షర్మిలమ్మ సైతం ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, వైయస్ఆర్ టీపీ యువజన నాయకుడు శీలం శీను, మహిళ నాయకురాలు రమాదేవి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నందిగామ మండల ప్రెసిడెంట్ ఈదులపల్లి నరసింహ టౌన్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజ్ జాంగిర్ ఎంఏ ఇసాక్ కొత్తూరు మండల ప్రెసిడెంట్ బూస జంగన్న ఫరక్ నగర్ మండల ప్రజెంట్ గోపి నాయక్ కొందుర్గు మండల ప్రెసిడెంట్ మహేంద్ర, ప్రెసిడెంట్ వెంకటేష్, సత్యం, రాము, ప్రకాష్ చారి, సుదర్శన్, బిక్షపతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: