సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలకు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీటవేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గంలో పలు దేవాలయాలు దర్గాలు, చర్చ్, ప్రార్ధన మందిరాల్లో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. దేవాలయాల్లో పూజలు, ప్రార్థనలు, అదేవిధంగా జహంగీర్ పీర్ దర్గాలో ప్రార్థనలు చేసి నియోజక వర్గం ప్రజలకు శుభం జరగాలని ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే అంజయ్య ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాలతో పాటు మన కవులు, కళాకారులకు తెలంగాణ వచ్చాకే తగిన గౌరవం, గుర్తింపు దక్కిందన్నారు. కనీవినీ ఎరుగతి రీతిలో దేవాలయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు వేములవాడ రాజన్న, వరంగల్ భద్రకాళి, ఐనవోలు, కొమురవెళ్లి మల్లన్న తదితర పురాత దేవాలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ జరుగుతుందన్నారు. ధూప దీప నైవేద్యాలకు నోచని చిన్న చిన్న గుడులు, గోపురాలు నేడు కళకళలాడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో త్వరలోనే జహంగీర్ పీర్ దర్గా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసం సర్వశక్తులు పెట్టి కృషి చేస్తానని అన్నారు. దశలవారీగా అభివృద్ధి వేగం పుంజుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, జెడ్పిటిసిలు వెంకట్రామిరెడ్డి, షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, నారాయణరెడ్డి, కొత్తూరు, నందిగామ, కొందుర్గు జెడ్పిటిసిలు, ఎంపిపిలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin