Friday, 08 May 2026 11:38:23 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

లెప్రసీ వ్యాధిపై అవగాహన సదస్సు... జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ వై అరుణ

Date : 14 July 2023 05:53 AM Views : 436

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లెప్రసీ అవగాహన సదస్సు షాద్ నగర్ అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ లెప్రసీ అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లా లెప్రసీ ఆఫీసర్ డాక్టర్ వై అరుణ హాజరైనారు. లెప్రసీ అవగాహన సదస్సులో డాక్టర్ అరుణ మాట్లాడుతూ.. ఈ కుష్టి వ్యాధి మైకో బాక్టీరియం లెప్రే అనే ఒక సూక్ష్మ క్రిమి ద్వారా సోకే వ్యాధి అని చెప్పారు. ఈ వ్యాధి వంశపారంపరంగా రాదు అని తెలియజేశారు. కుష్టు వ్యాధి చర్మము, నరాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి అని, శరీరంపై ఎక్కడైనా స్పర్శ కోల్పోవడం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం అని తెలియజేశారు. ఈ వ్యాధి గుర్తించడం స్పర్శ లేని, మొద్దు బారిన చర్మము, చర్మము పై ఎరుపు, తెలుగు రంగు కల మచ్చలు కుష్టు వ్యాధి కావచ్చునని చెప్పారు. ఈ వ్యాధి లక్షణాలు కనుబొమ్మలు రాలిపోవడం, చెవితమ్మలు మందంగా మారడం, చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు, వాపులు, పుండ్లు, బొబ్బలు, ఒంటిపైన గడ్డలు, కాయలు రావడం, ముక్కు నుంచి రక్తం పడటం వంటి లక్షణాలు ఉన్నవారు దగ్గరలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని డాక్టర్ అరుణ తెలియజేశారు. ఈ వ్యాధి నిర్ధారణ చికిత్స అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా జరుపబడునని చెప్పారు. ఈ వ్యాధి కి మందులు 6 నుండి 12 నెలలు వాడినట్లయితే, ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని తెలియజేశారు. ఈ వ్యాధి వలన ఏర్పడిన అంగవైకల్యం శాస్త్ర చికిత్సతో సరి చేయవచ్చునని చెప్పారు. ఈ వ్యాధి బారిన పడిన వారందరూ తమ, తమ పూర్తి సామాజిక జీవితము గడపవచ్చునని తెలియజేశారు. ఈ వ్యాధి మానవాళికి తెలిసిన అతి ప్రాచీనమైన వ్యాధి అని చెప్పారు. ప్రతి సంవత్సరము ప్రపంచం మొత్తం మీద నయమవుతున్న కేసులలో సగానికి ( 50% )పైగా మనదేశంలోనే ఉంటున్నాయి అని చెప్పారు. ఈ వ్యాధి మొత్తం కేసులలో 10 శాతం వరకు చిన్న పిల్లలు ఈ వ్యాధికి గురవుతున్నారని జిల్లా కుష్టు వ్యాధి అధికారి డాక్టరు అరుణ తెలియజేశారు. జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ అరుణ చేతుల మీదుగా లెప్రసీ పేషెంట్లకు పాదరక్షలు, మందుల కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ డివిజన్ హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, ఎం ఎల్ హెచ్ పి వైద్యాధికారి డాక్టర్ సాదిక్, పారామెడికల్ ఆఫీసర్ సులోచన, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్లు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ ఆజాద్, అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎన్జీవో లెప్రా ఇండియా ఫిజియోథెరపిస్టు బాబురావు, డివిజన్ లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లెప్రసీ వ్యాధి ఇన్చార్జి సూపర్వైజర్లు, యూపీఎస్సీ ఏఎన్ఎం శిరీష, ఆశలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: