సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల్లో ఎక్కువ శాతం కురుమ,యాదవులు వున్నారు అని వారికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించి అన్ని రాజకీయ పార్టీలు శాసన సభ్యులకు రాజ్య సభ స్థానాలకు యం.యల్.సి లకు అవకాశం ఇవ్వాలని హైదరబాద్ లో కురుమ సంఘం ఆధ్వర్యంలో రాజకీయ ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి యం.యల్.సి యెగ్గే మల్లేశం కురుమ హాజరు అయినారు.అదేవిధంగా బద్రద్రాద్రి కొత్తగూడెం జిల్లా కురుమ సంఘం ఇంచర్జ్ భారత రాంబాబు హాజరు అయినారు.ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ వచ్చే నెల సెప్టెంబర్ మెదటి వారంలో కురుమ సింహ గర్జన హైద్రాబాద్ లో జరుగుతుంది అని జిల్లాలో వున్న కురుమలు అందరూ వెళ్ళాలి అని జిల్లాలో ఎక్కువ మంది రాజకీయంగా చైతన్యవంతులు అయి రానున్న ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు వార్డు నెంబర్ల దగ్గర నుండి జిల్లా స్థాయిలో వుడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శి చిన్నం మల్లేశం,మధు,గంగయ్య,నరేష్, పండరి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin