Tuesday, 15 September 2026 06:45:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అగ్రవర్ణ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలి... -బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రా కామేష్

Date : 29 August 2023 08:45 AM Views : 256

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చుంచుపల్లి : అగ్రవర్ణ పార్టీలకు,అగ్రవర్ణ పార్టీల నాయకులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని చుంచుపల్లి తండాలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ ఎందుకు సీఎం కావాలి అనే కరపత్రాలు పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆరు నెలల ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ ను ఎందుకు ప్రకటించింది? అతను ఆరున్నర సంవత్సరాల ప్రభుత్వ సర్వీస్ కాలం మిగులుండగానే అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశారనే పరిణామాలన్ని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలన్నారు.గత 70 ఏళ్ళ పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,ప్రస్తుత తెలంగాణలో కేవలం ఆధిపత్య వర్గాల నాయకులే ముఖ్యమంత్రులు అయ్యారని 90 శాతానికి పైగా ఉన్న బహుజనులు మాత్రం అడుగడుగునా తొక్కివేయబడి కేవలం కూలీలుగా జీవిస్తున్నారని,తరతరాలుగా మన తాతలు,తండ్రులు కూలీ పని మీద ఆధారపడి బతుకుతుంటే,ఆధిపత్య వర్గాలు మాత్రం మన భూములు గుంజుకొని ఫంహౌస్ లు కట్టుకున్నారని ఇంకెంత కాలం మోసపోదామన్నారు.మళ్ళీ ఈసారి కూడా దోపిడీ దొరల మాయమాటలు నమ్మి వారికి ఓట్లేస్తే మరోసారి బొందలో పడి బానిసత్వంలో మునగడం ఖాయమని అందుకే అప్రమత్తంగా ఉండి బీఎస్పీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈకార్యక్రమంలో సాయి,జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,భూక్యా శంకర్,భీముడు,కవిత,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :