సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడు చేర్ల : నడి రోడ్డు మీద అధికారుల నిర్లక్ష్యం తో వ్యక్తి మృతి చెందిన పట్టించుకోని స్థానిక నాయకులు నేరేడు చేర్ల మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఒంగోజు శేఖర్ మిర్యాలగూడ రోడ్డు లోని హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద డివైడర్ను దాటుతుండగా సెంట్రల్ లైటింగ్ స్తంభానికి విద్యుత్ సరఫరా జరిగే అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పిల్లుట్ల రఘు శేఖర్ మృతి చాలా బాధాకరం అని సంతాపం తెలియజేయడం తో పాటు బాధిత కుటుంబానికి వెంటనే నష్టపరిహారం అందించాలని కోరడం జరిగింది. శేఖర్ కుటుంబానికి నా వంతు సహకారం ఉంటదని చెప్పడంతోపాటు శ్రద్ధాంజలి తెలియజేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వర్షాకాలం కావడంతో ప్రజల కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది...
-----------------------
Admin