సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గత మూడేళ్లు గా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో వున్న మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు యండి. యాకూబ్ పాషా శుక్రవారం నాడు ఒక ప్రకటన లో ప్రభుత్వాన్ని కోరారు. ఈ మూడేళ్ళ కాలంలో మొత్తం 461.05 కోట్లు బడ్జెట్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ పేద మైనారిటీ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు. విద్యార్థులు తమ సర్టిఫికెట్లను కాలేజీ లో పొందేందుకు గాను, అప్పులు చేసి కాలేజీ యాజమాన్యాలకు నగదును చెల్లించి సర్టిఫికెట్లను పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత మూడేళ్లుగా పెండింగ్ లో వున్న మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
-----------------------
Admin