Wednesday, 29 July 2026 05:46:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీసీ కులాల వారికి లక్ష రూపాయలు మంజూరు చేయాలి...

Date : 01 June 2023 07:58 AM Views : 316

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయనున్నట్లుప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని,,, కాగా కేవలం కులవృత్తుల వరకే కాకుండా అన్ని బీసీ కులాలకు ఈ పథకం వర్తింపజేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ నేతలతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ..... బీసీ కులాల్లో అనేక కులాల వారికిప్రత్యేకమైన వృత్తులు లేవని వృత్తులు లేని చాలా కులాలు ఉన్నాయని,మున్నూరు కాపులు,పెరిక, లాంటి దాదాపు 20 కులాల వారికి వ్యవసాయము, చిరు వ్యాపారం, లాంటి వృత్తిలో జీవిస్తున్నారని వారికి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, ప్రస్తుత పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలాంటి సహాయం చేసే దిశగా ఆలోచన చేయకపోవడం బాధాకరమని, ప్రత్యేక వృత్తి లేని కులాల వారిని గుర్తించి, వారికి నైపుణ్యంఉన్న రంగాలలో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తగు ప్రోత్సాహం అందించాలని తద్వారా బీసీ కులాలు అభివృద్ధి చెందుతాయని, కేవలం ఎన్నికల కోసం ఓట్ల రాజకీయంచేయడం తగదని, బీసీలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే శాస్త్రీయంగా అధ్యయనం చేసి అందరికీ తగు సహాయం అందించాలని ఆయన కోరారు.. అలాగే బీసీ జన గణన చేసేందుకు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, కేంద్ర ప్రభుత్వం అంగీకరించక పోయినప్పటికీ, హైకోర్టు అనుమతి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా బీసీ జనగణన చేపట్టాలని, తెలంగాణ ప్రభుత్వం గతంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయట పెట్టాలని, ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన బీసీ ఎస్టీ, ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలలో నిరుపేదలను కూడా గుర్తించి ప్రభుత్వం తగువిధంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. ఆయన వెంట అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :