Wednesday, 29 July 2026 11:11:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి....

Date : 06 November 2022 11:15 PM Views : 473

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : *మేం ఎప్పటికీ ప్రజా సేవకులమే..* *అప్పుడు..ఇప్పుడు ప్రజల్లోనే ఉన్నాం. * చరిత్రలో నిలిచేలా సాగిన ప్రజాసంకల్ప పాదయాత్ర. *నాటి పాదయాత్ర ఫలితాలే నేటి సంక్షేమ పథకాలు. *మూడేళ్ల పాలనలో విప్లవాత్మక సంస్కరణలు. *జగన్‌కు వస్తున్న ఆదరణ చేసే ప్రతిపక్షాల కుట్రలు. *ప్రజలకు విధేయులుగా ముందుకు సాగుతాం. *పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్ధి కుంట శ్రీధర్ రెడ్డి స్పష్టీకరణ. *ఘనంగా ప్రజాసంకల్ప పాదయాత్ర ఐదేళ్ల వేడుక. * మహానేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పార్టీ శ్రేణుల ఘన నివాళి . *సత్యసాయి జిల్లా అమడుగురు మండలం లో మహమ్మదాబాద్ సచివాలయ పరిధిలో కొక్కంటి పల్లి, వడ్డీ వారి పల్లి , బావి చెరువు పల్లి , నిలువు రాతి పల్లి, గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి, *ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా తాము ఎప్పటికీ ప్రజలకు సేవకులుగానే ఉంటామని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఫలితాలే ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు నగరంలో వేడుకలు నిర్వహించారు. మహమ్మదాబాద్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ తమ హోదా మాత్రమే మారిందని.. ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనలో మార్పు రాలేదన్నారు. తమపై విశ్వాసం ఉంచిన ప్రజలకు విధేయులుగా ఉంటామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పాలనలో ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు ప్రజలతో మమేకమయ్యారని తెలిపారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ సాగిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆనాడు ప్రజాకంఠక పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని.. ఆ తర్వాత అదే ప్రజల విశ్వాసంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చారన్నారు. పాదయాత్రలో ఏ కష్టాలైతే తెలుసుకున్నామో వాటికి పరిష్కార మార్గాలుగా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. పరిపాలనలో నూతన ఒరవడిని సృష్టించినట్లు చెప్పారు. గతంలో పింఛన్లు అందుకోవాలంటే అవస్థలు పడాల్సి వచ్చేదని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఒకటో తేదీనే నేరుగా ఇంటి వద్దకే పింఛన్‌ అందిస్తున్నామని తెలిపారు. చదువుకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరినీ చదివించే బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారని తెలిపారు. పేదవాడికి వైద్యం చేరువ కావాలన్న లక్ష్యంతో ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి వైద్యం ఖర్చు రూ.1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు 3225 రకాల వైద్య చికిత్సలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయలేదని, కానీ ఇప్పుడు జగన్‌ చేస్తుంటే కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని మండిపడ్డారు. కేవలం ఇప్పుడే కాదని, పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్‌పై అనేక కుట్రలు జరిగాయని చెప్పారు. చివరకు జైలుకు పంపినా జగన్‌ ఎన్నడూ బాధపడలేదని, ప్రజల కోసం ముందుకే కదిలారని తెలిపారు. ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే ప్రజాప్రతినిధులు, నాయకులంతా గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును తెలుసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అగ్రగామిగా చేయడానికి సీఎం జగన్‌ అడుగులు వేస్తున్నారని, ఈరోజు ఇతర రాష్ట్రాలు సైతం ఇక్కడి పథకాలపై అధ్యయనం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. తాము ప్రజలకు విధేయులుగా ఉంటూ ప్రజా సేవకులుగానే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :