సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : 2019 రవాణా చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం ఎన్ఎస్టి రోడ్ వద్ద రాస్తారోకో, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై విక్రం, జిల్లా కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రవాణ రంగ కార్మికుల వ్యతిరేక విధానాల మీద, ప్రజా రవాణా వాహనాలకు డీజిల్ పై ఎక్సైజ్ సుంకం నుండి మినహాయింపు ఇవ్వాలని, టోల్ టాక్స్ పెంపు ప్రతిపాదన విరమించుకోవాలని, టోల్ పెంపు ప్రజలపై అదనపు భారం పడుతూ ఉందని, రవాణా నిత్యవసర ధరలపై ప్రభావం చూపుతుందని, మోటార్ వాహన చట్టం 2019 సవరించాలని డిమాండ్ చేశారు. 2023 ఏప్రిల్ 5న చలో ఢిల్లీ మజ్జుధర్ కిషన్ సంఘర్ష ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ జరిగే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ధరవత్ రాందాస్, జిల్లా కోశాధికారి దండగల ఉపేందర్, ఆటో యూనియన్ జిల్లా నాయకులు శ్రీను, యాసీన్, అక్బర్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నవీన్ రెడ్డి, నాయకులు కంపాటి వెంకన్న , వెంకన్న బాబు, మాచర్ల గోపాల్, పుల్లయ్య, డ్రైవర్లు రమేష్, శీను, నాగేశ్వరావు, కాసిం తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin